MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-29-movie61be7485-1090-46ab-8633-8aeef7306d26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-29-movie61be7485-1090-46ab-8633-8aeef7306d26-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా తో తెలుగు సినిమా ఏంటో యావత్ దేశానికి తెలియజేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా యావత్తు ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చవిచూసేలా చేశారు. తెలుగు సినిమాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలా చీప్SSMB 29;MOVIE{#}Bahubali;Genre;RRR Movie;Industries;CBN;bollywood;Darsakudu;Director;K V Vijayendra Prasad;Rajamouli;Hollywood;Audience;Telugu;Chitram;Cinemaమహేష్ కోసం భారీ స్కెచ్ వేసిన జక్కన్న.. వర్క్ అవుట్ అవుతుందా..?మహేష్ కోసం భారీ స్కెచ్ వేసిన జక్కన్న.. వర్క్ అవుట్ అవుతుందా..?SSMB 29;MOVIE{#}Bahubali;Genre;RRR Movie;Industries;CBN;bollywood;Darsakudu;Director;K V Vijayendra Prasad;Rajamouli;Hollywood;Audience;Telugu;Chitram;CinemaThu, 24 Aug 2023 12:00:00 GMTతెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా తో తెలుగు సినిమా ఏంటో యావత్ దేశానికి తెలియజేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా యావత్తు ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చవిచూసేలా చేశారు. తెలుగు సినిమాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతేకాదు ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలా చీప్ గా చూసిన బాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు తెలుగులో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తోంది.  అంతేకాదు హాలీవుడ్ నటులు కూడా తెలుగులో నటించడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి తెలుగు సినిమాలకు ఎంత గుర్తింపును తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి అడ్వెంచర్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాలో ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న..

ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉండడంతో.. ఒకవైపు స్క్రిప్టింగ్ పనులు జరుగుతూనే మరొకవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.  ఈ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా గురించి అప్డేట్లను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గ్లోబల్ అడ్వెంచర్ జోనర్ మూవీ కావడం వల్ల ఒక హాలీవుడ్ సెలబ్రిటీ ఉంటారని విజయేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని ఆయన హింట్ కూడా ఇచ్చారు. మరి జక్కన్న మహేష్ బాబు కోసం ఈసారి ఎవరిని తీసుకొస్తారో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>