Educationmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/trt-notificatione1ff3998-14cd-4f6c-a4df-4d035d15524d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/trt-notificatione1ff3998-14cd-4f6c-a4df-4d035d15524d-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలియజేసింది.. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది.నేడు టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి గారు తెలిపTRT notification{#}Qualification;Elections;Reddy;Telangana;students;september;Minister;Governmentనిరుద్యోగుల కల నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం....!!నిరుద్యోగుల కల నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం....!!TRT notification{#}Qualification;Elections;Reddy;Telangana;students;september;Minister;GovernmentThu, 24 Aug 2023 16:15:00 GMTతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలియజేసింది.. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది.నేడు టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి గారు తెలిపారు. 

రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు కూడా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్ లను ఇచ్చి దాదాపు అన్ని ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఇక మిగిలింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఒక్కటే. ఇవాళ్టితో ఆ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపు 5 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల అయింది. నేడు టీఆర్టీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరి రాష్ట్రములో టెట్ అర్హత సాధించని వారు 2 లక్షల మంది వున్నారు. ఇంకా 20 వేల మంది వరకు కొత్తగా డిఈడి, బిఈడి పూర్తి చేసిన వారు వున్నారు. వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెప్టెంబరు 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించి సెప్టెంబర్ 27 న టెట్ ఫలితాలను విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ లో తెలియజేసింది.ఇది వరకు పేపర్ 1 కు కేవలం డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే రాసుకునేందుకు అవకాశం ఉంది.

కానీ 2018 లో బిఈడి పూర్తి చేసిన వారికీ కూడా పేపర్ 1 రాసుకునేందుకు ఎన్సిటీఈ గైడ్ లైన్స్ విడుదల చేసింది.అయితే ఎలిమెంటరి విద్యార్థులకు కేవలం డిఈడి పూర్తి చేసిన వారు  మాత్రమే భోదించేందుకు అర్హులు అంటూ తాజాగా  సుప్రీం కోర్ట్ తీర్పును వెలువరించింది.ఆ తీర్పు ప్రకారం ఎన్సిటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని బిఈడి విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>