TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whats-app6442c1c9-1726-4810-809c-1dfae3edeb5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whats-app6442c1c9-1726-4810-809c-1dfae3edeb5d-415x250-IndiaHerald.jpgవాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు కాంటాక్ట్ పేరును మీ ఫోన్లో సేవ్ చేయకుండానే వాట్సాప్ గ్రూప్ లలో యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో ఏదైనా గ్రూప్ ని క్రియేట్ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి వినియోగదారులు ఆ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ సేవ్ చేస్తే గానీ గ్రూప్ లో యాడ్ చేయడం కుదరదు. అయితే ఈ కొత్త అప్ డేట్ తో డైరెక్ట్ గా నంబర్ నే గ్రూప్ లో యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.మెటా సీఈఓ మారWHATS APP{#}Smart phone;WhatsApp;India Gate;Red;India;Manamవాట్సాప్ అప్డేట్: మరో కొత్త ఫీచర్ వచ్చేసింది?వాట్సాప్ అప్డేట్: మరో కొత్త ఫీచర్ వచ్చేసింది?WHATS APP{#}Smart phone;WhatsApp;India Gate;Red;India;ManamThu, 24 Aug 2023 20:16:00 GMTవాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు కాంటాక్ట్ పేరును మీ ఫోన్లో సేవ్ చేయకుండానే వాట్సాప్ గ్రూప్ లలో యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో ఏదైనా గ్రూప్ ని క్రియేట్ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి వినియోగదారులు ఆ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ సేవ్ చేస్తే గానీ గ్రూప్ లో యాడ్ చేయడం కుదరదు. అయితే ఈ కొత్త అప్ డేట్ తో డైరెక్ట్ గా నంబర్ నే గ్రూప్ లో యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్ లోని ఈ అప్ డేట్ గురించి తన ఇన్ స్టా గ్రామ్ ఇంకా ఫేస్ బుక్ హ్యాండిల్స్ ప్రకటించారు. కొన్ని వారాల్లో ఈ ఫీచర్ గ్లోబల్ వైడ్ గా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేయడం చాలా సులభతరం అవుతుందని చెప్పారు. కాంటాక్ట్ లిస్ట్ లో పేరును సేవ్ చేయకుండానే చాలా ఈజీగా నంబర్ తోనే గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చని ఆయన వివరించారు.వినియోగదారులు  గ్రూప్ ను క్రియేట్ చేయాలనుకొన్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. పేరులేని గ్రూప్ లో పేరు లేకుండా ఆరుగురిని ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇంకా గ్రూప్లో ఉన్న వారి పేర్లు డైనమిక్‌గా పెట్టబడతాయని మీరు గమనించాలి.ఇంకా ఈ ఫీచర్ వ్యక్తుల ప్రైవసీకి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంది.


గ్రూప్ లోని ప్రతి పార్టిసిపెంట్‌కు గ్రూప్ పేరు భిన్నంగా కనిపిస్తుందని వాట్సాప్ కంపెనీ తెలిపింది. వారు తమ ఫోన్‌లో కాంటాక్ట్‌లను ఎలా సేవ్ చేసుకున్నారనే దాని ఆధారంగా ఈ పేరు అనేది ఉంటుంది.ఒకవేళ్ల మీ కాంటాక్ట్ ని సేవ్ చేయని వ్యక్తులు మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తే, గ్రూప్ పేరుగా మీ ఫోన్ నంబర్ అక్కడ కనిపిస్తుంది.అయితే వాట్సాప్ తన లేటెస్ట్ ప్రైవసీ ఇనిషియేటివ్ 3డీ అనామోర్ఫిక్ ఇన్ స్టాలేషన్ ను ముంబైలోని ఇండియా గేట్ వద్ద లాంచ్ చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తొలి 3డీ అనామోర్ఫిక్ ఇన్ స్టాలేషన్ వాట్సాప్ గోప్యతా లేయర్‌లు ఎలా కలిసి పనిచేస్తాయో చూపిస్తుంది. సృజనాత్మక కథనాలను ఇంకా హైపర్‌లోకల్ చిహ్నాలను ఉపయోగించి ప్రైవేట్ మెసేజింగ్ కోసం సురక్షితమైన స్థలాన్ని సృష్టిస్తుంది.ముంబై నగరం కాలీ-పీలీ టాక్సీ, రెడ్ పోస్ట్ బాక్స్, ఐకానిక్ స్ట్రీట్ ల్యాంప్స్ ఇంకా గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న పావురాలు వంటి చిహ్నాలను వినియోగిస్తుంచి అద్భుతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా అలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, టూ స్టెప్ వెరిఫికేషన్, తెలియని కాలర్‌లను మ్యూట్ చేయడం ఇంకా అదృశ్యమవుతున్న సందేశాలు వంటి లక్షణాలను ఈకొత్త ఇన్ స్టాలేషన్ హైలైట్ చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>