EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap8a26290b-df0d-4ab6-bd3f-58b8b02ce5ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap8a26290b-df0d-4ab6-bd3f-58b8b02ce5ea-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కొన్ని హక్కులు వచ్చాయి. అందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాదులో ఉన్న మెడికల్ కాలేజీల్లో 20% సీట్లు ఆంధ్ర విద్యార్థులకు ఇవ్వాలని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తివేస్తూ కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే 100% సీట్లు పొందేలా జీవో తీసుకువచ్చారు. దీంతో ఆంధ్ర విద్యార్థులు నష్టపోతున్నారు. అయితే మెడికల్ కాలేజీలో సీట్లు పొందడంపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి ఏ పార్టీ కూడా దీనిపై నోరు మెదపడం లేదు. కారణం వీరందరAP{#}Andhra Pradesh;Janasena;High court;students;YCP;court;Government;Party;Telangana;politics;KCRఏపీ విద్యార్థులకు అన్యాయం..నోరు మెదపని పార్టీలు?ఏపీ విద్యార్థులకు అన్యాయం..నోరు మెదపని పార్టీలు?AP{#}Andhra Pradesh;Janasena;High court;students;YCP;court;Government;Party;Telangana;politics;KCRWed, 23 Aug 2023 09:00:00 GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు  కొన్ని హక్కులు వచ్చాయి. అందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాదులో ఉన్న మెడికల్ కాలేజీల్లో 20% సీట్లు ఆంధ్ర విద్యార్థులకు ఇవ్వాలని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తివేస్తూ కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే 100% సీట్లు పొందేలా జీవో తీసుకువచ్చారు. దీంతో ఆంధ్ర విద్యార్థులు నష్టపోతున్నారు. అయితే మెడికల్ కాలేజీలో సీట్లు పొందడంపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి ఏ పార్టీ కూడా దీనిపై నోరు మెదపడం లేదు.


కారణం వీరందరికీ హైదరాబాదులో కోట్ల కొద్ది ఆస్తులు ఉండడం ఏమాత్రం మాట్లాడిన కూడా కేసీఆర్ సర్కారు వారి ఆస్తుల్ని ఏం చేస్తారోనని  భయం పట్టుకుందని విమర్శలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులే హైకోర్టులో కేసు వేశారు ఆ సమయంలో హైకోర్టు స్టే ఇచ్చింది.  ఇంత వరకు ఓకే గాని తర్వాత హైకోర్టు స్టే ఎత్తివేసింది. దీంతో తెలంగాణలో మెడిసిన్ చేయలనుకుంటున్న ఆంధ్ర విద్యార్థులకు ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి కూడా కనీసం ఆంధ్ర విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు.


ప్రభుత్వం తరఫున కోర్టు లో కేసు వాదించడానికి గెలిపించడానికి కేవలం అభ్యర్థులు మాత్రమే హైకోర్టులో కేసు వేసుకొని పోరాడాల్సి వచ్చింది. ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి ఇంత ప్రజాప్రతినిధులు ఉండి కూడా ఆంధ్ర విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు. మెడికల్ సీట్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే కనీసం దానిపై మాట్లాడడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు దీని ద్వారా పూర్తిగా ఆంధ్ర విద్యార్థులు నష్టపోతున్నారు.


ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా గాని తెలంగాణ సర్కార్‌ను  ప్రశ్నించే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు వైసీపీ టిడిపి జనసేన పార్టీలు తిట్టుకోవడం మాని రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయాలంటున్నారు. కానీ ఈ ప్రజాప్రతినిధులు ఇవేవీ పట్టించుకోకుండా ఓట్లు సీట్లు అంటూ రాజకీయాలు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>