MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejf0adf544-92e9-4ec3-9ac4-2d4a25bfeb81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejf0adf544-92e9-4ec3-9ac4-2d4a25bfeb81-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. ఆగస్టు 25న సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ గురించి మాట్లాడుతూ.." అతని సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. 'చందమామ కథలు', 'గరుడవేగ' లాంటి సినిమాలు చూశానVarun Tej{#}Accident;Bodyguard;praveen;Smart phone;prince;varun sandesh;varun tej;Sakshi;Darsakudu;Yevaru;media;Director;Cinema;Hero'గాండీవధారి అర్జున'లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషన్స్ ఉంటాయి : వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషన్స్ ఉంటాయి : వరుణ్ తేజ్Varun Tej{#}Accident;Bodyguard;praveen;Smart phone;prince;varun sandesh;varun tej;Sakshi;Darsakudu;Yevaru;media;Director;Cinema;HeroWed, 23 Aug 2023 21:00:00 GMTమెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. ఆగస్టు 25న సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ గురించి మాట్లాడుతూ.." అతని సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. 'చందమామ కథలు', 'గరుడవేగ' లాంటి సినిమాలు చూశాను. 'గని' షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి నేనేమీ అడగలేదు. కానీ యాక్షన్ సినిమా చేద్దాం అన్నాడు ". 

" అలా ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ ప్రాబ్లం ఎవరు పట్టించుకోము. అది వెంటనే మనపై ప్రభావం చూపేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ కథ చెప్పినప్పుడు కూడా కథలో మెయిన్ పాయింట్ తో పాటు ఎమోషన్స్ కూడా నచ్చాయి. 'గాండీవ దారి అర్జున' విషయానికొచ్చేసరికి.. ఇందులో ఎక్కువ రోప్ షాట్స్ ని సిజి వర్క్ ఉపయోగించకుండానే చేశాం. సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ లు చేసాం. రేపు థియేటర్లో చూస్తున్నప్పుడు తెలుస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లు చేసినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యాయి" అని చెప్పారు.

ఇక 'గాండీవ దారి అర్జున' సినిమా గురించి మాట్లాడుతూ.." 'గాండీవ దారి అర్జున' ఇది కథకు సరిగ్గా యాప్ట్ అయ్యే టైటిల్. కాల్ ఫర్ హెల్ప్ లాంటి టైటిల్. సినిమాలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హీరోని పిలుస్తారు. తన పేరు అర్జున్. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇది స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సినిమాలో ఏదో సందేశం ఇచ్చి, ఇదంతా మారాలని చెప్పడం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని మాత్రమే చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. రీసెంట్ గా ఈ సినిమా చూశాను. నాకు నచ్చింది.  'గాండీవ దారి అర్జున' విషయానికొస్తే యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా కథ నాలుగు రోజుల్లో జరిగే సినిమాగా తీసారు. ఇందులో ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>