Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood359d369b-3a0d-4f1c-b977-777ba9771941-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood359d369b-3a0d-4f1c-b977-777ba9771941-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ నుంచి వారసులుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య, అఖిల్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయా హీరోలకు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. అయితే నాగార్జున వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారిలో నాగచైతన్య కాస్త కూస్తో నిలదొక్కుకున్నాడు అనుకుంటున్న సమయంలో గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కస్టడీ అనే మూవీ తో Tollywood{#}naga;chandu;Akkineni Nagarjuna;Naga Chaitanya;Love Story;akhil akkineni;Cinemaనాగచైతన్య మూవీకి.. పని చేయబోతున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్?నాగచైతన్య మూవీకి.. పని చేయబోతున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్?Tollywood{#}naga;chandu;Akkineni Nagarjuna;Naga Chaitanya;Love Story;akhil akkineni;CinemaWed, 23 Aug 2023 11:15:00 GMTఅక్కినేని ఫ్యామిలీ నుంచి వారసులుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య, అఖిల్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు  తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.  అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయా హీరోలకు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. అయితే నాగార్జున వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారిలో నాగచైతన్య కాస్త కూస్తో నిలదొక్కుకున్నాడు అనుకుంటున్న సమయంలో గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కస్టడీ  అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఇక ప్లాప్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య. ఈ క్రమంలో ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  అయితే ఇక ఇప్పుడు చందు మొండేటితో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఇటీవల కాలంలో తన మ్యూజిక్తో సెన్సేషన్ సృష్టిస్తున్న అనిరుద్ రవిచందర్ ఇక అక్కినేని నాగచైతన్య హీరోకి మ్యూజిక్ అందించబోతున్నాడట. దీంతో ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయ్. ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ అంటే చాలు ఇక ఒక రేంజ్ లో ఉంటుందని అటు అభిమానులు కూడా అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే అతను ఇక స్వరాలు సమకూరుస్తూ ఉండడం గమనార్హం. దీంతో నాగచైతన్యకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా చైతు సరికొత్త లవ్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>