LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love26a4e9d5-18c0-4d2c-ba8e-b2c982bfce6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love26a4e9d5-18c0-4d2c-ba8e-b2c982bfce6a-415x250-IndiaHerald.jpgరోమియో జులియట్‌ చట్టం విదేశాల్లో ఉంది. టీనేజీలు పరస్పరం అంగీకారంతో లైంగిక కార్యకలాపలకు పాల్పడితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. కేవలం మోసం చేస్తే, లేదా ఆత్యాచారం చేస్తే మాత్రమే వారిపై కేసులు పెడతారు. దీనిపై ఇండియాలో కూడా 16 నుంచి 18 ఏళ్ల లోపు అమ్మాయి, అబ్బాయి లైంగికంగా పరస్పర అంగీకారంతో కలిస్తే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేంద్రాన్ని దీనిపై సమాధానం చెప్పాలని కోరారు. అయితే ఇండియాలో 16 నుLOVE{#}Supreme Court;Girl18 ఏళ్లు నిండకుండా శృంగారంలో పాల్గొంటే?18 ఏళ్లు నిండకుండా శృంగారంలో పాల్గొంటే?LOVE{#}Supreme Court;GirlWed, 23 Aug 2023 07:00:00 GMTరోమియో జులియట్‌ చట్టం విదేశాల్లో ఉంది. టీనేజీలు పరస్పరం అంగీకారంతో లైంగిక కార్యకలాపలకు పాల్పడితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. కేవలం మోసం చేస్తే, లేదా ఆత్యాచారం చేస్తే మాత్రమే వారిపై కేసులు పెడతారు. దీనిపై ఇండియాలో కూడా 16 నుంచి 18 ఏళ్ల లోపు అమ్మాయి, అబ్బాయి లైంగికంగా పరస్పర అంగీకారంతో కలిస్తే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేంద్రాన్ని దీనిపై సమాధానం చెప్పాలని కోరారు.


అయితే ఇండియాలో 16 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా  ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం జైలు శిక్ష అనుభవించాల్సిందే. అమ్మాయి అయితే బాధితురాలిగా, అబ్బాయి అయితే నేరస్తుడిగా మారుతున్నారు. ఇష్ట పూర్వకంగా కలిసినా కూడా ఇండియాలో 16 నుంచి 18 ఏళ్ల లోపు వారికి జైలు శిక్ష తప్పదు. అయితే దీనిపై ఫారన్ కంట్రీలలో ఉన్న రోమియో జులియట్ చట్టాన్ని చూపిస్తూ సుప్రీం కోర్టు లో దాఖలైన పిటిషన్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది.


విదేశాల్లో వారి పరిస్థితులు, సంస్కృతికి అనుగుణంగా వారు తీసుకొచ్చిన చట్టాలను ఇండియాలో అమలు చేయాలని కోరడం ఏంటని చాలా మంది మేధావులు తప్పుబడుతున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి చట్టాలు ఇప్పుడు అవసరమేనని కొన్ని  కొన్ని సమయాల్లో అమాయకులైన పిల్లలు జైలు పాలు కావాల్సి వస్తుందని వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ చట్టంపై చాలా లోతుగా పరిశీలన చేయాలి. ఇండియాలో ఒక వేళ ఈ చట్టాన్ని గనక తీసుకొస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఏ విధమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేజర్ కాకుండానే లైంగిక చర్యల్లో పాల్గొంటే ఎదురయ్యే సమస్యలు, వాటి తర్వాత పర్యవసానాలు అన్ని పరిశీలించాలి. అప్పుడే ఈ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని మేధావులు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ తేదీన హిందీలో ప్రసారం కానున్న "ఎఫ్3" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>