Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh2ccdf79c-f665-4fed-9cb3-dab9106065df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh2ccdf79c-f665-4fed-9cb3-dab9106065df-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను సాధించిన ఘనతలే అతని గురించి గొప్పగా చెబుతూ ఉంటాయి. భారత క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో ఏకంగా భారత జట్టుకు రెండుసార్లు ప్రపంచ కప్ లు ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనికే ఉంది. అయితే ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. ధోని అందించిన వరల్డ్ కప్ తర్వాత అటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయిRohirh{#}MS Dhoni;venkat;Rohit Sharma;World Cup;Cricketధోని చెప్పడం వల్లే.. వరల్డ్ కప్ నుండి రోహిత్ ను పక్కన పెట్టాం?ధోని చెప్పడం వల్లే.. వరల్డ్ కప్ నుండి రోహిత్ ను పక్కన పెట్టాం?Rohirh{#}MS Dhoni;venkat;Rohit Sharma;World Cup;CricketWed, 23 Aug 2023 10:30:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను సాధించిన ఘనతలే అతని గురించి గొప్పగా చెబుతూ ఉంటాయి. భారత క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో ఏకంగా భారత జట్టుకు రెండుసార్లు ప్రపంచ కప్ లు ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనికే ఉంది. అయితే ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి.


 ధోని అందించిన వరల్డ్ కప్ తర్వాత అటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది. అయితే ధోని వరల్డ్ కప్ గెలవడానికి కారణం జట్టు ఎంపిక విషయంలో అతను ఎంతో ఖచ్చితత్వంతో ఉండడమే. జట్టుకు ఉపయోగపడతాడు అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే జట్టులోకి ఆ ఆటగాడిని తీసుకోవడానికి వెనకడుగు వేయడు ధోని. అదే సమయంలో ఇక జట్టుకు ప్రయోజనం లేదు అనుకుంటే ఎంతటి స్టార్ ప్లేయర్నైనా సరే పక్కన పెట్టడానికి కూడా ఆలోచించడు. ఇలా ఎంతో మంది సీనియర్లను పక్కనపెట్టి యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వడంతో అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.


 అయితే 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను అప్పుడు కెప్టెన్ గా ఉన్న ధోని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయం గురించి అప్పటి సెలెక్టర్ ప్యానల్ సభ్యుడు రాజ వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చెప్పడంతోనే ఇక వన్డే వరల్డ్ కప్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్ షెడ్యూల్ లో 15వ ఆటగాడిగా మేము రోహిత్ శర్మ పేరును సూచించాము. దీనికి కోచ్ కిర్ స్టర్ కూడా అంగీకరించారు. కానీ ధోని అంగీకరించకుండా రోహిత్ కు బదులు చావ్లను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. దీనికి కోచ్ కూడా ఓకే చెప్పాడు. దీంతో రోహిత్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు రాజ వెంకట్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>