MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth0df2446a-a7c3-40d4-9f78-762dd4e5d708-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth0df2446a-a7c3-40d4-9f78-762dd4e5d708-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇంకా ముందుకు దూసుకుపోతుంది. సూపర్ స్టార్ కి చాలా ఏళ్ల తర్వాత తన స్థాయి హిట్‍ను ఈ సినిమా తెచ్చిపెట్టింది. బీస్ట్ మూవీతో ట్రోల్స్ కి గురైన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. ఆగస్టు 10వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మొదటి వారం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందిజైలర్ సినిమా 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి దాకా రూ.566.13కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 13వ రోRAJINIKANTH{#}Mani Ratnam;tamannaah bhatia;Dilip Kumar;Kumaar;Rajani kanth;Tamil;shankar;Cinema;Kannada;Blockbuster hit;Director;Hero;Newsజైలర్ మూవీతో ఆ రికార్డ్ అందుకున్న డైరెక్టర్?జైలర్ మూవీతో ఆ రికార్డ్ అందుకున్న డైరెక్టర్?RAJINIKANTH{#}Mani Ratnam;tamannaah bhatia;Dilip Kumar;Kumaar;Rajani kanth;Tamil;shankar;Cinema;Kannada;Blockbuster hit;Director;Hero;NewsWed, 23 Aug 2023 17:46:00 GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇంకా ముందుకు దూసుకుపోతుంది. సూపర్ స్టార్ కి చాలా ఏళ్ల తర్వాత తన స్థాయి హిట్‍ను ఈ సినిమా తెచ్చిపెట్టింది. బీస్ట్ మూవీతో ట్రోల్స్ కి గురైన  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. ఆగస్టు 10వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మొదటి వారం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందిజైలర్ సినిమా 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి దాకా రూ.566.13కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 13వ రోజు ఈ సినిమాకి 9.63 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా రూ.600 కలెక్షన్ల మార్కు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా జైలర్  షేర్ రూ.300కోట్లకు చేరినట్టు సమాచారం తెలుస్తోంది.తమిళనాడులోనే జైలర్ సినిమా ఇప్పటి దాకా రూ.198.61 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఓవర్ సీస్ లో ఏకంగా 174 కోట్లు రాబట్టింది. ఇక USA లో 6 మిలియన్ డాలర్లు ఈ సినిమా వసూలు చేసింది.జైలర్ సినిమా 10 రోజుల్లోనే రూ.500కోట్ల మార్కును దాటి సూపర్ రికార్డులను సృష్టించింది.


పొన్నియన్ సెల్వన్ 1 లైఫ్ టైమ్ కలెక్షన్లను ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే దాటింది.రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 2.ఓ అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటికీ రికార్డుల్లో నిలిచింది. మొత్తం 700 కోట్ల పైగా ఈ సినిమా వసూళ్లు రాబట్టింది.ఈ మూవీతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అరుదైన రికార్డుని సాధించాడు. ఈ మూవీతో 500 కోట్ల డైరెక్టర్ గా శంకర్, మణిరత్నం సరసన నిలిచాడు. శంకర్ 2. ఒ, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో ఈ ఘనత సాధించగా, నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీతో ఆ ఘనత సాధించాడు. ఈ మూవీలో రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, మిర్నా మీనన్, సునీల్, తమన్నా ఇంకా యోగిబాబు కీలకపాత్రల్లో నటించారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యామియో పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>