HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/teeth-a1f865dc-f7ba-45d9-83f2-30d3b5c60b72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/teeth-a1f865dc-f7ba-45d9-83f2-30d3b5c60b72-415x250-IndiaHerald.jpgపూర్వం రోజుల్లో బొగ్గుతో తోమేటప్పుడే పళ్ళు ఆరోగ్యంగా మిలమిలా మెరుస్తూ ఉండేవి.కానీ ఇప్పుడున్న కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల,మిలమిల మెరుపులు పక్కన పెడితే,పళ్ళు పుచ్చిపోవడం,దంతాల నుండి దుర్గంధం వెదజల్లడం,చిగుళ్ల వాపు,చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే సహజంగా దొరికే కొన్ని రకాల పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు కూడా పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.దంతాలు ఆరోగ్యంగా,అందంగా ఉంటేనే కదా మన చిరునవ్వు కూడా అందంగా ఉంటుంది. గారపట్టిన దంతాలనTEETH;{#}oil;Apple;Chequeదంతాలు మిలమిలా మెరవాలంటే ఇవి వాడాల్సిందే..!దంతాలు మిలమిలా మెరవాలంటే ఇవి వాడాల్సిందే..!TEETH;{#}oil;Apple;ChequeWed, 23 Aug 2023 06:00:00 GMTపూర్వం రోజుల్లో బొగ్గుతో తోమేటప్పుడే పళ్ళు ఆరోగ్యంగా మిలమిలా మెరుస్తూ ఉండేవి.కానీ ఇప్పుడున్న కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల,మిలమిల మెరుపులు పక్కన పెడితే,పళ్ళు పుచ్చిపోవడం,దంతాల నుండి దుర్గంధం వెదజల్లడం,చిగుళ్ల వాపు,చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే సహజంగా దొరికే కొన్ని రకాల పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు కూడా పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.దంతాలు ఆరోగ్యంగా,అందంగా ఉంటేనే కదా మన చిరునవ్వు కూడా అందంగా ఉంటుంది. గారపట్టిన దంతాలను మిలమిలా మెరిసేందుకు ఉపయోగపడే పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

ఆపిల్ సిడర్ వెనిగర్..

ఎంత గార పట్టిన దంతాలైన ఒక చుక్క ఆపిల్ సిడర్ వీనిగర్ తోముకోవడంతో మిలమిల మెరిపించుకోవచ్చు. సాధారణంగా దంతాలు గార పట్టడానికి కారణం,ఎక్కువగా క్షారాలు పై పేరుకుపోవడమే.ఇటువంటి క్షారాలను ఇందులోని ఆమ్లగుణాలు తొలగింప చేస్తాయి.దానితో పళ్ళు మెలమెలా మెరుస్తాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్..

ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక స్పూన్ నోట్లో వేసుకొని 20 నిమిషాల పాటు పుక్కలించడంతో దంతాలపై ఉన్న గార తొలగి,దంతాలు మిలమిలా మెరుస్తాయి.అంతేకాక చిగుళ్ళ నుంచి రక్తం కారడం,చిగురులో వాపును కూడా పోగొట్టడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

నువ్వుల నూనె..

పళ్ళు పుచ్చిపోవడం దంతాలపై గారా వంటి సమస్యలతో బాధపడేవారు నువ్వులనూనెను పుక్కలించి బయటికి ఉమ్మి వేయాలి.ఇలా తరచూ చేయడంతో పళ్ళపై గార తొలగి,పళ్ళు మెరుస్తూ ఉంటాయి.

యాక్టివేటెడ్ చార్కోల్..

బొగ్గునే యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు.పూర్వం మన పెద్దలు ఆ బొగ్గుతోనే పళ్ళు తోమేవారు.దానితో వారి పళ్ళ ఆరోగ్యం మెరుగ్గా ఉండేది.దీనికోసం వారానికి రెండు సార్లయినా మన వాడే టూత్ బ్రష్పై చిటికెడు చార్కోలు వేసి,పళ్ళు తోముకోవడంతో పళ్లపై గార తొందరగా తొలగిపోతుంది.

 ఆరెంజ్ ఆయిల్..

పసుపు పచ్చగా ఉన్న పళ్ళను ఆరెంజ్ ఆయిల్ బాగా క్లీన్ చేస్తుంది.దీనికోసం బ్రష్ పై మూడు చుక్కల ఆరెంజ్ ఆయిల్ వేసుకొని పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

అరటి తొక్క..

దంతాలు పసుపచ్చగా ఉండడం,దంతాల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తొలగించడానికి అరటి తొక్క నీ తీసుకొని,పళ్ళపై 10 నిమిషాల పాటు రుద్దాలి.ఇలా తరచూ చేయడం వల్ల,పళ్ళ ఆరోగ్యం మెరుగుపడి మిలమిలా మెరుస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వాసులు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>