Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle78f7d7d5-d47c-49ea-aa9f-6f8ada77b4c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle78f7d7d5-d47c-49ea-aa9f-6f8ada77b4c1-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వాచ్ లు అంటే చాలా ఇస్తామనే సంగతి ఆయన్ని ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.ఇప్పటికే ఆయన కలెక్షన్ లిస్టులో అనేక ఖరీదైన లగ్జరీ వాచీలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో బ్రాండెడ్ వాచీలు ధరించి నేషనల్ మీడియాను సైతం ఆకర్షించాడు. అయితే ఇప్పుడు తాజాగా తారక్ చేతికి పెట్టుకున్న ఓ వాచ్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల సోదరి నందమూరి సుహాసిని తనsocialstars lifestyle{#}Saif Ali Khan;koratala siva;suhasini;Switzerland;James Cameron;sunday;Party;RRR Movie;RRR;Chitram;Indian;Hero;Jr NTR;kalyan;marriage;India;bollywood;NTR;Heroine;Cinema;Amazonఎన్టీఆర్ చేతికున్న వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా.....??ఎన్టీఆర్ చేతికున్న వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా.....??socialstars lifestyle{#}Saif Ali Khan;koratala siva;suhasini;Switzerland;James Cameron;sunday;Party;RRR Movie;RRR;Chitram;Indian;Hero;Jr NTR;kalyan;marriage;India;bollywood;NTR;Heroine;Cinema;AmazonWed, 23 Aug 2023 20:17:22 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వాచ్ లు అంటే చాలా ఇస్తామనే సంగతి ఆయన్ని ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.ఇప్పటికే ఆయన కలెక్షన్ లిస్టులో అనేక ఖరీదైన లగ్జరీ వాచీలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో బ్రాండెడ్ వాచీలు ధరించి నేషనల్ మీడియాను సైతం ఆకర్షించాడు. అయితే ఇప్పుడు తాజాగా తారక్ చేతికి పెట్టుకున్న ఓ వాచ్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల సోదరి నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలీలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో తారక్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచీపై నెటిజన్ల దృష్టి పడింది. దీని ధర ఎంత ఉంటుందబ్బా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారు, దాని రేటు చూసి అవాక్కవుతున్నారు.

ఎన్టీఆర్ చేతికి ధరించింది స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్  అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ, దీని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. నిజానికి ఈ బ్రాండ్లో లభించే ప్రతీ వాచ్ చాలా విలువైనదే. తారక్ గతంలో rrr ప్రమోషన్స్ లో పాటక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/A మోడల్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని రేటు ఇండియన్ కరెన్సీలో రూ. 1 కోటి 56 లక్షల పైనే ఉంటుంది. ఇప్పుడు దాదాపు రెండున్నర కోటి విలువ చేసే వాచీ ధరించి ఉన్నాడు.తారక్ పెట్టుకున్న కాస్ట్లీ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ ఫేవరేట్ హీరో అంతటి ఖరీదైన చేతి గడియారం పెట్టుకున్నాడని అభిమానులు పెడుతున్నారు. కొన్ని మీమ్ పేజెస్ మాత్రం ఆ ఒక్క వాచ్ దొరికితే మాత్రం మన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా చాలాసార్లు ఖరీదైన వాచీలతో వార్తల్లో నిలిచారు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫర్రెల్ తో కలిసి పార్టీ చేసుకున్నప్పుడు, రూ. 8 కోట్ల విలువైన రిచార్డ్ మిల్లీ బ్రాండ్ వాచ్ తో కనిపించాడు. అదే బ్రాండ్ కు చెందిన రూ. 4 కోట్లు విలువచేసే F1 ఎడిషన్ వాచ్ మరియు రూ. 7.6 కోట్ల విలువైన RM 40-01 టర్బాలిన్ స్పీడ్ వాచ్ తో పాటుగా మరికొన్ని కాస్ట్లీ వాచీలు ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ వాచీలతో పాటుగా లగ్జరీ కార్స్, బైక్స్, బ్రాండెడ్ దుస్తులపై మక్కువ చూపిస్తుంటారు. ఇప్పటికే లగ్జరీ ఫీచర్స్ తో ఉన్న అనేక కాస్ట్లీ కార్లను బైక్స్ ను తారక్ ఇష్టంగా తెప్పించుకున్నారు. అలానే వాటికి ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన దగ్గర ఉన్న వాహనాలకు '9999' అనే నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లంబోర్ఘిని ఉరుస్ కారుకు కూడా అదే నెంబర్ తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>