BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/uidaid6514f05-4be5-4b44-adc4-59ea05be6d00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/uidaid6514f05-4be5-4b44-adc4-59ea05be6d00-415x250-IndiaHerald.jpgమన ఇండియాలో ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారత పౌరులకు గుర్తింపు కార్డు. అలాగే ఇది భారత పౌరులకు చిరునామా రుజువు కూడా. ఇంకా అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ముఖ్యమైన పత్రం కూడా ఇది.ఆధార్‌ కార్డ్ లో వ్యక్తి వేలిముద్ర బయోమెట్రిక్స్, కంటి గుర్తింపు వంటి సున్నితమైన సమాచారం ఉంటుంది. యూఐడీఏఐ నిర్వహించే ఆధార్ కార్డును దుర్మార్గులు ఖచ్చితంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డ్ ను అప్‌డేట్ చేసే క్రమంలో ప్రజలను మోసం చేసే కేసులు పెరిగాయి. ఇక ఈ స్కాUIDAI{#}WhatsApp;Aadhar;UIDAI;Cheque;NewsUIDAI: ఆధార్ వినియోగదారులకు హెచ్చరిక?UIDAI: ఆధార్ వినియోగదారులకు హెచ్చరిక?UIDAI{#}WhatsApp;Aadhar;UIDAI;Cheque;NewsTue, 22 Aug 2023 20:23:00 GMTమన ఇండియాలో ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారత పౌరులకు గుర్తింపు కార్డు. అలాగే ఇది భారత పౌరులకు చిరునామా రుజువు కూడా. ఇంకా అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ముఖ్యమైన పత్రం కూడా ఇది.ఆధార్‌ కార్డ్ లో వ్యక్తి వేలిముద్ర బయోమెట్రిక్స్, కంటి గుర్తింపు వంటి సున్నితమైన సమాచారం ఉంటుంది. యూఐడీఏఐ నిర్వహించే ఆధార్ కార్డును దుర్మార్గులు ఖచ్చితంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డ్ ను అప్‌డేట్ చేసే క్రమంలో ప్రజలను మోసం చేసే కేసులు పెరిగాయి. ఇక ఈ స్కామ్‌లకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు యూఐడీఏఐ తరచుగా పనిచేస్తుంది. ఇప్పుడు మోసగాళ్లు ఇమెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ ప్రూఫ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. దీనిపై ఆధార్ అథారిటీ సోషల్ మీడియాలో అలర్ట్ మెసేజ్ ని పోస్ట్ చేసింది.ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ ఎప్పటికీ ID రుజువు లేదా చిరునామా రుజువు పత్రాలను ఇమెయిల్ లేదా వాట్సాప్‌ రూపంలో అడగదు.


స్కామర్ల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయండి. లేదా మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లి అప్‌డేట్ చేయండి' అని యూఐడీఏఐ చెబుతోంది.ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డ్ ను అప్‌డేట్ చేయడానికి మార్గాలు.. ముందుగా uidai వెబ్‌సైట్‌లోని మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లండి. తరువాత మీ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ చేయండి. తరువాత డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగానికి వెళ్లి, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి.ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో ఏ పత్రాన్ని అప్‌డేట్ చేయాలో మీరు కనుగొనండి. ధృవీకరణ కోసం అసలు పత్రం స్కాన్ చేసిన కాపీని మీరు అప్‌లోడ్ చేయండి.ఇక దీని తర్వాత మీకు SRN నంబర్ లేదా సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ కనిపిస్తుంది. దీన్ని గుర్తించుకోవడం ఖచ్చితంగా చాలా ముఖ్యం. ఎందుకంటే తదుపరి ప్రాసెసింగ్ అవసరమైనప్పుడు సూచన కోసం ఈ సంఖ్య అవసరం కావచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>