EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/priyanka6f9e76e4-040a-44c6-aee9-41dd7b6ff010-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/priyanka6f9e76e4-040a-44c6-aee9-41dd7b6ff010-415x250-IndiaHerald.jpgబిజెపిలో నరేంద్ర మోడీ తర్వాత తానే అన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటున్నారట ఈమధ్య. అయితే ఆయన మాట ఆయన వ్యక్తిగతం దానికి పార్టీతో సంబంధం ఉండదు. బిజెపిలో మాత్రమే కాదు అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అల్కాలాంబ ఇదే విధంగా మాట్లాడిందని తెలుస్తుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లాగా ఎవరికైనా టిక్కెట్లు ఇస్తుందా అంటే లేదు అనే తెలుస్తుంది. అయితే ఆమే ఒక అధిష్టానం వర్గం లాగా ఢిల్లీలో ఏడు మేమే పోటీ చేPRIYANKA{#}SoniaGandhi;priyanka;Rahul Gandhi;Smriti Irani;Nijam;Raccha;Arvind Kejriwal;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Election;Congressవారణాసిలో మోడీని ప్రియాంక మట్టికరిపిస్తుందా?వారణాసిలో మోడీని ప్రియాంక మట్టికరిపిస్తుందా?PRIYANKA{#}SoniaGandhi;priyanka;Rahul Gandhi;Smriti Irani;Nijam;Raccha;Arvind Kejriwal;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Election;CongressTue, 22 Aug 2023 05:00:00 GMTబిజెపిలో నరేంద్ర మోడీ తర్వాత తానే అన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటున్నారట ఈమధ్య. అయితే ఆయన మాట ఆయన వ్యక్తిగతం దానికి పార్టీతో సంబంధం ఉండదు. బిజెపిలో  మాత్రమే కాదు అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి  అల్కాలాంబ ఇదే విధంగా మాట్లాడిందని తెలుస్తుంది.


ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లాగా ఎవరికైనా టిక్కెట్లు ఇస్తుందా అంటే లేదు అనే తెలుస్తుంది. అయితే ఆమే ఒక అధిష్టానం వర్గం లాగా ఢిల్లీలో ఏడు మేమే పోటీ చేస్తాం అని చెప్పుకొచ్చేసింది ఇప్పుడు. కానీ నిజానికి ఈ విషయం గురించి రాహుల్ గాంధీ అలాగే కేజ్రీవాల్ లాంటి అగ్ర నేతలు కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ప్రకటించాలి. అయితే ఇవేవీ లేకుండానే తనకు తాను గానే ఈ విధంగా చెప్పడం జరిగింది.


దాంతో కాంగ్రెస్ వ్యతిరేక కూటములన్నీ ఈ విషయం పై రచ్చ చేయడం మొదలు పెట్టాయట. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య సంబంధాలు చెడిపోయాయని వాళ్ళు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టేసారట. అసలు ఏం జరుగుతుందన్నది నిజానికి ఫైనల్ గా ఎలక్షన్స్ ముందు తెలుస్తుంది . కానీ తానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తానే ఒక సోనియా గాంధీ అన్నట్లుగా తాను చెప్పిందే నిజం అన్నట్లుగా చెప్పుకొచ్చింది ఈ అల్కలాంబ.


ప్రియాంక గాంధీ వారణాసి నుంచి మోడీపై పోటీ చేయబోతుందని మరొక వ్యక్తి  చెప్పాడట. అలాగే రాహుల్ గాంధీ పై  స్మృతి ఇరానీ పోటీ చేస్తుందని చెప్పాడట ఆ వ్యక్తి. వీళ్లు రాష్ట్ర నాయకులే అవ్వచ్చు కానీ వీళ్ళ మాటలతో  పార్టీలను నాశనం చేయడం తప్ప మరి ఏమీ ఉండదని అంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు వారణాసిలో కాంగ్రెస్ తరపున ప్రియాంక కనుక పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కదన్న వాదన కూడా వినిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి పారిపోయారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>