PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-brs-kcra190bb59-f97d-4727-83d3-82a8f10ab51b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-brs-kcra190bb59-f97d-4727-83d3-82a8f10ab51b-415x250-IndiaHerald.jpgదాంతో ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలోనే మంత్రి హరీష్ రావుతో చాలాసేపు భేటీ అయ్యారు. దాంతో రాజాసింగ్ కచ్చితంగా బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో దాన్ని ఎంఎల్ఏ ఖండించినా ఆయన వైఖరిపైన చాలామందిలో అనుమానాలు అలాగే కంటిన్యు అవుతున్నాయి. తాజాగా ఎంఎల్ఏ టికెట్ల ప్రకటనలో కేసీయార్ గోషామహల్ ను పెండింగులో ఉంచటంతో మరోసారి అందరి అనుమానాలు పెరుగుతున్నాయి. telangana brs kcr{#}Medak;MLA;Party;KCR;Minister;Bharatiya Janata Partyహైదరాబాద్ : ఏడుగురికి కేసీయార్ షాకిచ్చారా ?హైదరాబాద్ : ఏడుగురికి కేసీయార్ షాకిచ్చారా ?telangana brs kcr{#}Medak;MLA;Party;KCR;Minister;Bharatiya Janata PartyTue, 22 Aug 2023 09:00:00 GMT


రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై ఏడుగురు ఎంఎల్ఏలకు కేసీయార్ పెద్ద షాకే ఇచ్చారు. వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, కోరుట్లు, మెట్ పల్లి, ఉప్పల్, ఖానాపూర్, అసిఫాబాద్, కామారెడ్డిలో సిట్టింగ్ ఎంఎల్ఏలకు కేసీయార్ మొండిచెయ్యి చూపించారు. వీళ్ళస్ధానంలో ఇతరులకు టికెట్లు ప్రకటించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాలు నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్లో అభ్యర్ధులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు.





ఈ నాలుగు నియోజకవర్గాలను ఎందుకు పెండింగులో ఉంచారో కేసీయార్ కే తెలియాలి. నాలుగింట్లో కూడా గోషామహల్ నియోజకవర్గాన్ని రాజాసింగ్ కోసమే పెండింగ్ లో ఉంచారనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే గోషామహల్ సిట్టింగ్ ఎంఎల్ఏ బీజేపీ నేత రాజాసింగ్. రాజాసింగ్ ను దాదాపు ఏడాదిన్నర క్రితం బీజేపీ సస్పెండ్ చేసింది. తనపైన సస్పెన్షన్ ఎత్తేయమని రాజాసింగ్ ఎన్నిసార్లు అడిగినా పార్టీ పెద్దలు పట్టించుకోవటంలేదు.





దాంతో ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలోనే మంత్రి హరీష్ రావుతో చాలాసేపు భేటీ అయ్యారు. దాంతో రాజాసింగ్ కచ్చితంగా బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.  అప్పట్లో దాన్ని ఎంఎల్ఏ ఖండించినా ఆయన వైఖరిపైన చాలామందిలో అనుమానాలు అలాగే కంటిన్యు అవుతున్నాయి. తాజాగా ఎంఎల్ఏ టికెట్ల ప్రకటనలో కేసీయార్ గోషామహల్ ను పెండింగులో ఉంచటంతో మరోసారి అందరి అనుమానాలు పెరుగుతున్నాయి.





రాజాసింగ్ కోసం వెయిట్ చేయాలని కాకపోతే గోషామహల్లో అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగులో పెట్టాల్సిన అవసరం కేసీయార్ కు లేదు. ఏదేమైనా ఒకేసారి 115 మంది అభ్యర్ధులను ప్రకటించటం సాహసమనే చెప్పాలి. ముందునుండి అనుకొంటున్నట్లే కొందరు సీనియర్లకు కేసీయార్ మొండిచెయ్యి చూపించారు. ఇలాంటి వారిలో రాజయ్య, తుమ్మల నాగేశ్వరరావు,  జలగం వెంకటరావు, గంగ గోవర్ధన్, రేఖానాయక్ లాంటి వాళ్ళున్నారు. మొత్తంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే కేసీయార్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతుండటమే. మెదక్ జిల్లాలోని గజ్వేలుతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో కూడా కేసీయార్ పోటీ చేయబోతున్నారు.


 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>