MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevif4ebc82f-eafe-446f-8097-deb18b3303dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevif4ebc82f-eafe-446f-8097-deb18b3303dc-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి లెజెండరి స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి హీరో అయ్యి రెండు దశాబ్దాలుకు పైగా నెంబర్ వన్ హీరోగా నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. అప్పటికే పునాది రాళ్లు సినిమా మొదలైనా తొలి విడుదల మాత్రం ప్రాణం ఖరీదే.ప్రాణం ఖరీదు తర్వాత దాదాపు 20 సినిమాలు చేసినా కూడా చిరంజీవికి హీరోగా తగిన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో 1982లో కోడి CHIRANJEEVI{#}allu ramalingaiah;vegetable market;Gang Leader;krishna;kodi ramakrishna;prema;Party;Love;Telugu;Chiranjeevi;Hero;CinemaHBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?CHIRANJEEVI{#}allu ramalingaiah;vegetable market;Gang Leader;krishna;kodi ramakrishna;prema;Party;Love;Telugu;Chiranjeevi;Hero;CinemaTue, 22 Aug 2023 14:29:00 GMTఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి లెజెండరి స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి హీరో అయ్యి రెండు దశాబ్దాలుకు పైగా నెంబర్ వన్ హీరోగా నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ రోజు  మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. అప్పటికే పునాది రాళ్లు సినిమా మొదలైనా తొలి విడుదల మాత్రం ప్రాణం ఖరీదే.ప్రాణం ఖరీదు తర్వాత దాదాపు 20 సినిమాలు చేసినా కూడా చిరంజీవికి హీరోగా తగిన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య సినిమా చిరుకు గుర్తింపుతో పాటు మార్కెట్ ని కూడా తీసుకొచ్చింది.వరుస మూవీస్ తో బిజీగా ఉన్న చిరుకి 1980లో అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. అప్పటికే చిరు మొత్తం 10 సినిమాలకు పైగా నటించారు. అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాక చిరుకి మరింతగా కలిసి వచ్చింది అని అని చెప్పొచ్చు. మెగాస్టార్ క్రమశిక్షణ,సినిమాపై ఆయనకి ఉన్న పిచ్చి ప్రేమ వలనే చిరు అనతికాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఇక 1983లో చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాతో నెంబర్ వన్ వైపు తొలిసారి అడుగులు వేశాడు చిరంజీవి.1


988లో మరణ మృదంగం సినిమా షూటింగ్‌ను చెన్నైలో షూట్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో ఓ అభిమాని వచ్చి తన పుట్టినరోజు అని కేక్‌ను తినిపించబోయాడు. అయితే ఆ కేక్‌లో ఏదో రంగురంగుల పదార్థాలు కనిపించాయి. ఇక మెగాస్టార్ మేకప్ వేసుకునే సమయంలో గమనిస్తే చిరంజీవి పెదాలు నీలి రంగులోకి మారాయి. డాక్టర్స్ దగ్గరకు వెళ్లగా ఇది విష ప్రయోగం అని వారు చెప్పారు. అప్పటి నుంచి చిరంజీవి బయటి ఫుడ్ అస్సలు తినరట. 1991లో గ్యాంగ్ లీడర్ మూవీ అప్పటి దాకా ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది.1998లో వర్మతో ఒక సినిమా కూడా సైన్ చేశాడు చిరంజీవి. రెండు పాటలు కూడా షూట్ చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత 2005 దాకా చిరంజీవి ఎలాంటి ఫాంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ తో ఇక 2008లో రాజకీయ పార్టీ స్టార్ట్ చేసి దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.రాజకీయాల్లో దారుణంగా ఫెయిల్ అయిన చిరంజీవి మళ్ళీ 2017లో రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150తో మళ్లీ తనేంటో నిరూపించుకున్నారు. ఇక 2022లో ఇక సినిమాలకు దూరం కానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>