HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lipes-beauty501b61d6-cb82-48a0-86f6-3887d6ab4b8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lipes-beauty501b61d6-cb82-48a0-86f6-3887d6ab4b8d-415x250-IndiaHerald.jpgకొంతమందికి బ్యూటీ అనేది ముఖము అందంగా ఉంటే రాదు.లిప్స్ కూడా మంచి షేప్ మరియు పింక్ కలర్ లో ఉంటేనే వారి అందం మరింత పెరుగుతుంది. సాధారణంగా లిప్స్ చిన్నప్పుడు అందంగా వున్నా,పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారం,తాగే టీ,కాఫీలపై, ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.అంతేకాక బీడీ,సిగరెట్ అలవాటు వున్నవారికి కూడా పెదవులపై మృత కణాలు పేరుకుపోయి, నల్లగా అవుతుంటాయి.మరి అలాంటి పెదవులకు ఎంత లిప్స్టిక్ లు వేసుకున్నా అప్పటికప్పుడు ఎర్రగా కనిపిస్తాయి.కానీ వాటి వల్ల కూడా క్రమంగా దెబ్బతింటాయి.అలాంటి పెదవులను రిపేర్ చేయడానికి న్యా్చరLIPES;BEAUTY{#}Beetroot;Pink;Manam;BEAUTYదొండపండు వంటి పెదవుల కోసం ఇలా చేసి చూడండి..!దొండపండు వంటి పెదవుల కోసం ఇలా చేసి చూడండి..!LIPES;BEAUTY{#}Beetroot;Pink;Manam;BEAUTYMon, 21 Aug 2023 06:00:00 GMTకొంతమందికి బ్యూటీ అనేది ముఖము అందంగా ఉంటే రాదు.లిప్స్ కూడా మంచి షేప్ మరియు పింక్ కలర్ లో ఉంటేనే వారి అందం మరింత పెరుగుతుంది. సాధారణంగా లిప్స్ చిన్నప్పుడు అందంగా వున్నా,పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారం,తాగే టీ,కాఫీలపై, ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.అంతేకాక బీడీ,సిగరెట్ అలవాటు వున్నవారికి కూడా పెదవులపై మృత కణాలు పేరుకుపోయి, నల్లగా అవుతుంటాయి.మరి అలాంటి పెదవులకు ఎంత లిప్స్టిక్ లు వేసుకున్నా అప్పటికప్పుడు ఎర్రగా కనిపిస్తాయి.కానీ వాటి వల్ల కూడా క్రమంగా దెబ్బతింటాయి.అలాంటి పెదవులను రిపేర్ చేయడానికి న్యా్చరల్ ఇంట్లో దొరికే పదార్థాలతో చేసే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.మరి అవేంటో తెలుసుకుందామా..!

అలోవెరా..

అలోవెరాను ఇంట్లో ఈజీగా ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు.దీనితో పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొందరగా తొలగిపోతాయి.ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెదాలను ఎర్రగా మార్చడానికి సహాయపడతాయి కుడా.దానికోసం అలోవెరా జెల్‌ని తీసుకుని పెదాలపై బాగా మసాజ్ చేయాలి.అరగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే సరి.

బీట్‌రూట్..

పెదాలపై ఉన్న మృతకణాలు,నల్ల మచ్చలను తొలగించడంలో బీట్‌రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.దీన్ని రాయడం వల్ల,నల్లని పెదవులు నెల రోజుల్లోగా గులాబీ పువ్వుల్లా మృదువుగా తయారవుతాయి.దాని కోసం బీట్‌రూట్‌ను తొక్క తీసి తురుమి, అందులో అర స్పున్ చక్కెర వేసి బాగా కలిపి,తర్వాత మీ పెదాలపై అప్లై చేసుకోవాలి.అలానే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత పెదాలను నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

దోసకాయ..

పెదవులపై నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు బాధపడేవారు ఈజీగా దొరికే దోసకాయను ఉపయోగించవచ్చు.దోసకాయ నిజానికి చర్మాన్ని హైడ్రేట్  గా ఉంచుతుంది. ఈ చిట్కా కోసం తాజా దోసకాయ ముక్కలను తీసుకొని,పెదవులపై అరగంట పాటు మసాజ్ చేస్తూ ఉండాలి.ఇలా చేయడంతో పెదవులు కొన్ని రోజుల్లో సహజంగా ఎర్రపు రంగును సంతరించుకుంటాయి.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు , సిలికా-రిచ్ కాంపౌండ్స్ పెదవులపై వున్న మృతకణాలు, నల్ల మచ్చలను తొందరగా తొలగిస్తుంది.మరి మీ పెదవులను ఈ చిట్కాలతో అందంగా మార్చుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భగవంత్ కేసరి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది గా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>