MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanikanthcd0e74e6-3836-489f-b674-22be41959118-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajanikanthcd0e74e6-3836-489f-b674-22be41959118-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తమిళలకు విపరీతమైన అభిమానం. వాస్తవానికి రజనీ పుట్టింది పెరిగింది కర్ణాటక ప్రాంతం అయినప్పటికీ తమిళ ప్రజల హృదయాలలో రజనీకాంత్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘జైలర్’ మూవీ ఘన విజయం సాధించినప్పటికీ రజనీకాంత్ ఎలాంటి స్పందనను తెలియచేయలేదు. రజనీకాంత్ కు కనీసం సోషల్ మీడియాలో పెద్దగా ఎకౌంట్స్ కనిపించవు. వరస పరాజయాలను ఎదుర్కుంటున్న రజనీకాంత్ కు ‘జైలర్’ ఒక కొత్త ఊపిరిని ఇచ్చింది అనుకోవాలి. అయితే తమిళ ప్రజలకు విపరీతమైన ఆత్మాభిమానం ఎక్కువ. దీనితో తాము ఆరాధించే హీరోలు ఏఒక్క తప్పు చRAJANIKANTH{#}Yogi Adityanath;Abhilasha;Tamil;Uttar Pradesh;yogi;Rajani kanth;Cinema;Bharatiya Janata Party;Partyరజనీకాంత్ పై భగ్గుమంటున్న తమిళ తంబీలు !రజనీకాంత్ పై భగ్గుమంటున్న తమిళ తంబీలు !RAJANIKANTH{#}Yogi Adityanath;Abhilasha;Tamil;Uttar Pradesh;yogi;Rajani kanth;Cinema;Bharatiya Janata Party;PartyMon, 21 Aug 2023 10:00:00 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తమిళలకు విపరీతమైన అభిమానం. వాస్తవానికి రజనీ పుట్టింది పెరిగింది కర్ణాటక ప్రాంతం అయినప్పటికీ తమిళ ప్రజల హృదయాలలో రజనీకాంత్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘జైలర్’ మూవీ ఘన విజయం సాధించినప్పటికీ రజనీకాంత్ ఎలాంటి స్పందనను తెలియచేయలేదు.


రజనీకాంత్ కు కనీసం సోషల్ మీడియాలో పెద్దగా ఎకౌంట్స్ కనిపించవు. వరస పరాజయాలను ఎదుర్కుంటున్న రజనీకాంత్ కు ‘జైలర్’ ఒక కొత్త ఊపిరిని ఇచ్చింది అనుకోవాలి. అయితే తమిళ ప్రజలకు విపరీతమైన  ఆత్మాభిమానం ఎక్కువ. దీనితో తాము ఆరాధించే హీరోలు ఏఒక్క తప్పు చేసినా తమిళ ప్రజలు అంగీకరించరు. హిమాలయాల నుండి రజనీకాంత్ తిరిగి వచ్చిన తరువాత భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కాళ్లను తాకి పాద నమస్కారం చేయడం రజనీకాంత్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.


దీనితో రజనీకాంత్ ను సూపర్ స్టార్  అని తాము ఆరాధిస్తూ ఉంటే రజనీకాంత్ తన స్థాయిని వదులుకుని తనకంటే చిన్నవాడైన ఆదిత్యా నాథ్ కాళ్ళకు మొక్కీ రజనీకాంత్ పొరపాటు చేశాడు అంటూ సోషల్ మీడిఆలో రజనీకాంత్ పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను విని రజనీకాంత్ అభిమానులు కూడ తీవ్ర అసహనంలో  ఉన్నారు .వాస్తవానికి రజనీకాంత్ కు భారతీయ జనతా పార్టీ ముఖ్యనాయకులతో చాల మంచి సాన్నిహిత్యం ఉంది.


రాజకీయాలలో రాణించాలని రజనీకాంత్ కు అభిలాష ఉన్నప్పటికీ రాజకీయ పార్టీ ప్రకటన చేసి కూడ సాహసం చేయలేకపోయాడు. ఈవిషయంలో తనను క్షమించమంటూ రజనీ తన అభిమానుల వద్ద తన విచారాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ ఒక రాజకీయ వేత్త అందునా తన కంటే వయసులో చిన్న వాడైన యోగి ఆదిత్యానాథ్ కాళ్ళకు మొక్కడం ఎంతవరకు సమంజసం అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ కాబట్టి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకు  మొక్కీ ఉంటాడు అంటూ మరికొందరి అభిప్రాయాలు..


ReplyForward




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>