MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema6617a98e-975c-4854-94ad-ba9116a564b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema6617a98e-975c-4854-94ad-ba9116a564b0-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా రంగం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చింది. ఎన్టీఆర్, ఎస్పీఆర్, ఎఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కష్టపడుతూ.. దీనికి తోడు నిర్మాతలు, దర్శకుల కృషి కూడా కలిసి వచ్చి సినిమా ఇండస్ట్రీ మెరుగుపడింది. అనంతరం వచ్చిన వారి తరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి వారు ఫిల్మ్ ఇండస్ట్రీని నిలపడంలో సఫలమయ్యారనే చెప్పొచ్చు. అయితే సినిమా రంగం నిలదొక్కుకుని బాగా నడుస్తుందన్న సమయంలో కరోనా దెబ్బ వారిని బాగా కుంగదీసింది. సినిమాలో పని చేసే కార్మికుల నుంచCINEMA{#}Akkineni Nagarjuna;bhavana;sobhan babu;Coronavirus;cinema theater;Audience;Cinema;Saturdayసినీజోష్.. మళ్లీ కళకళలాడుతున్న థియేటర్లు..?సినీజోష్.. మళ్లీ కళకళలాడుతున్న థియేటర్లు..?CINEMA{#}Akkineni Nagarjuna;bhavana;sobhan babu;Coronavirus;cinema theater;Audience;Cinema;SaturdayMon, 21 Aug 2023 08:53:14 GMTతెలుగు సినిమా రంగం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చింది. ఎన్టీఆర్, ఎస్పీఆర్, ఎఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కష్టపడుతూ.. దీనికి తోడు నిర్మాతలు, దర్శకుల కృషి కూడా కలిసి వచ్చి సినిమా ఇండస్ట్రీ మెరుగుపడింది. అనంతరం వచ్చిన వారి తరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి వారు ఫిల్మ్ ఇండస్ట్రీని నిలపడంలో సఫలమయ్యారనే చెప్పొచ్చు.


అయితే సినిమా రంగం నిలదొక్కుకుని బాగా నడుస్తుందన్న సమయంలో కరోనా దెబ్బ వారిని బాగా కుంగదీసింది. సినిమాలో పని చేసే కార్మికుల నుంచి పెద్ద పెద్ద యాక్టర్ల వరకు ఒక్కరికి కూడా  పని దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేదు. సినిమా రంగంలోని చాలా మంది ప్రముఖులు కూడా మరణించారు. దీంతో సినిమా రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూస్తారా? అసలు ఎందుకు చూడాలి. ప్రాణం కంటే సినిమా ఎక్కువ కాదు కదా అనే భావన ప్రజల్లో నెలకొంది. దీంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు థియేటర్ కు ఏ ఒక్కరు కూడా థియేటర్ కు రాలేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఈ రంగం ఓటీటీకి మళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ సినిమా కార్మికులు, సినిమా రంగం ఏ విధంగా మెరగుపడుతుందనే భావన అందరిలో నెలకొంది.


సినిమా వారు రాజకీయాల్లో ఉండటం కూడా వివాదాలు చెలరేగాయి. అయితే గత శనివారం దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమా చూశారని తెలుస్తోంది. ఇది నిజంగా సినిమా రంగంలోని అందరూ ఆనందించాల్సిన విషయం. కరోనా నుంచి కోలుకుని ఇంత పెద్ద ఎత్తున్న ఒకే రోజు ప్రేక్షకులు రావడం 100 ఏళ్ల చరిత్రలో మొదటిసారి కావడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>