MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3e42379d-4265-49ef-8e62-f4bb914f597a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money3e42379d-4265-49ef-8e62-f4bb914f597a-415x250-IndiaHerald.jpgచాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగానికి బదులు వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొంతమంది చాలీచాలని జీతంతో సైడ్ బిజినెస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇక మీరు కూడా సమయం దొరికినప్పుడు పండుగ సీజన్లను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ భారీగా వస్తుందని చెప్పవచ్చు. ఈ బిజినెస్ ఇంట్లోనే మొదలుపెట్టి డబ్బు సంపాదించవచ్చు. త్వరలోనే రక్షాబంధన్ రాబోతున్న నేపద్యంలో ప్రతి అక్క చెల్లెమ్మలు తమ సోదరులకు రక్షాబంధన్ ను కట్టి తమ ప్రేమను నిరూపించుకుంటూ ఉంటారు. ఇప్పటికే మార్కెట్ ను రాఖీలు పూర్తిగా ఆక్రమించేసాయి.MONEY{#}Rakshabandhan;festival;vegetable market;Indians;IndiaMoney: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. రక్షాబంధన్ వేళ..!Money: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. రక్షాబంధన్ వేళ..!MONEY{#}Rakshabandhan;festival;vegetable market;Indians;IndiaMon, 21 Aug 2023 11:00:00 GMTచాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగానికి బదులు వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొంతమంది చాలీచాలని జీతంతో సైడ్ బిజినెస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇక మీరు కూడా సమయం దొరికినప్పుడు పండుగ సీజన్లను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ భారీగా వస్తుందని చెప్పవచ్చు. ఈ బిజినెస్ ఇంట్లోనే మొదలుపెట్టి డబ్బు సంపాదించవచ్చు. త్వరలోనే రక్షాబంధన్ రాబోతున్న నేపద్యంలో ప్రతి అక్క చెల్లెమ్మలు తమ సోదరులకు రక్షాబంధన్ ను కట్టి తమ ప్రేమను నిరూపించుకుంటూ ఉంటారు.

ఇప్పటికే మార్కెట్ ను రాఖీలు పూర్తిగా ఆక్రమించేసాయి. ఇక ఒక దాని తర్వాత ఒక పండుగ వస్తున్న నేపథ్యంలో రక్షాబంధన్ , ఫ్రెండ్షిప్ డే అంటూ చాలా బ్యాండ్స్ అమ్ముడు పోతాయి. కాబట్టి మీరు వెరైటీ వెరైటీ రాఖీలను తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు  ఇంట్లో కూర్చొని రాఖీ తయారు చేస్తే .. ఈ చిన్నపాటి వ్యాపారం మీకే కాదు మీతో పాటు నలుగురు ఆడవాళ్లకు కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా సుమారుగా 1000 కోట్ల విలువైన రాఖీలు అమ్ముడుపోయాయి.  మీరు కూడా అందమైన,  ఆకర్షణీయమైన చౌక ధరకు రాఖీలను తయారు చేసే విక్రయించి డబ్బు పొందవచ్చు.

వాస్తవానికి భారత్ కి ,  చైనా నుంచి వచ్చే రాఖీల సంఖ్య ఎక్కువే. ఇక చైనా నుంచి ప్రతి ఏటా లక్షలాది రాఖీలు విభినమైన డిజైన్లతో భారత్ కి వస్తూ ఉంటాయి.  అందుకే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో చాలామంది భారతీయులు కూడా చైనాను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో రాఖీలు తయారు చేసి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. మీరు కూడా రూ .20,000 నుంచి ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే భారీ ఆదాయం పొందవచ్చు . రాఖీ తయారు చేయడానికి పట్టు దారం , పూసలు, కాగితం వంటి అలంకార సామాగ్రి అవసరం అవుతాయి.  వీటిని పెద్ద మొత్తంలో తయారుచేసి మార్కెట్లో హోల్సేల్ ధరలకు విక్రయించినా కూడా భారీ ఆదాయం వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>