Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/malingaf6b5b3d7-92a1-4097-9d99-97c3e04e5f80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/malingaf6b5b3d7-92a1-4097-9d99-97c3e04e5f80-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారధ్యంలో అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం గా ఉంది. అందుకే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అంటే చాలు టీమ్స్ అన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్ల నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పర్వాలేదు అనిపించినప్పటికీ టైటిల్ పోరులో మాత్రం నిలవలేకపోయింది ముంబై ఇండియన్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్ లోMalinga{#}Rohit Sharma;Sri Lanka;2020;Champion;Chennai;Mumbai;Rajasthanవారెవ్వా.. మలింగా మళ్ళీ ముంబైలోకి రాబోతున్నాడు?వారెవ్వా.. మలింగా మళ్ళీ ముంబైలోకి రాబోతున్నాడు?Malinga{#}Rohit Sharma;Sri Lanka;2020;Champion;Chennai;Mumbai;RajasthanSun, 20 Aug 2023 14:30:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారధ్యంలో అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం గా ఉంది. అందుకే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అంటే చాలు టీమ్స్ అన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్ల నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పర్వాలేదు అనిపించినప్పటికీ టైటిల్ పోరులో మాత్రం నిలవలేకపోయింది ముంబై ఇండియన్స్.


 ఇక చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ విజేతగా నిలిచి అత్యధిక సార్లు అంటే ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడమే.. ఈ లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలోనే జట్టులో పలు మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. జట్టుకు భారంగా మమారిన  ఆటగాళ్లకు ఉద్వాసన పలుకెందుకు కూడా రెడీ అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చే ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది.


 ఒకప్పుడు ముంబై జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించి ఇక జట్టుకు అద్వితీయమైన విజయాలు అందించిన.. శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగాను మళ్లీ జట్టులో భాగం చేసుకోవాలని భావిస్తుంది ముంబై ఫ్రాంచైజీ. ఈ క్రమంలోనే అతని జట్టు బౌలింగ్ కోచ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి  ఇక ప్రస్తుతం ఉన్న షేన్ బాండ్ ను తప్పించి అతడి స్థానంలో ఇక మలింగాను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుందట. కాగా 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు మలింగ. 122 మ్యాచ్లలో 170 వికెట్లు తీసాడు. 2021లో ఆటకు వీడ్కోలు పలికి రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా అవతారం ఎత్తాడు. మళ్లీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ లోకి రాబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటి లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>