Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesa974c738-64e4-4455-89c2-d5978118a58e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesa974c738-64e4-4455-89c2-d5978118a58e-415x250-IndiaHerald.jpgమలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ లను కూడా అందుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు తన సినిమాలలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రలు అయితే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోయేవే అని చెప్పాలి. Movies{#}Tollywood;Hindi;Remake;Mahanati;October;dulquer salmaan;king;King;Father;Rajani kanth;Thriller;Cinemaరిమేక్ సినిమాలు చేస్తారా.. షాకింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్?రిమేక్ సినిమాలు చేస్తారా.. షాకింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్?Movies{#}Tollywood;Hindi;Remake;Mahanati;October;dulquer salmaan;king;King;Father;Rajani kanth;Thriller;CinemaSun, 20 Aug 2023 08:50:00 GMTమలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ లను కూడా అందుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు తన సినిమాలలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రలు అయితే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోయేవే అని చెప్పాలి.


 మలయాళం తో పాటు హిందీ తమిళం తెలుగులోను చిత్రాలు చేస్తూ ప్రేక్షకాదరణ  పొందుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక తెలుగులో గతంలో మహానటి ఇక ఇటీవల సీతారామం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మలయాళంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. కింగ్ ఆఫ్ కోత అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న  సినిమాను తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది అని చెప్పాలి. అక్టోబర్ 24వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.


 ఇక దుల్కర్ సల్మాన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ రిమేక్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు రిమేక్ సినిమాలు చేస్తారా మీ నాన్నగారి సినిమాలో ఏదైనా చేస్తే అవకాశం ఉందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పాడు. రిమేక్ సినిమాలను చేసే ఛాన్స్ లేదు. మా నాన్న సినిమాలనే కాదు ఏ సినిమాను రీమేక్ చేయను అంటూ స్పష్టం చేశారు. కాగా టాలీవుడ్ బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో బడా హీరోలు రీమేక్ చేస్తూ హిట్లు కొడుతున్న తరుణంలో ఇక దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దోమలను చంపేందుకు పెట్టిన మస్కిటో కిల్లర్.. నలుగురి ప్రాణం తీసింది?

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>