MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/baby-girls-parentsb038509a-88b9-42cf-a7fc-0670380d87e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/baby-girls-parentsb038509a-88b9-42cf-a7fc-0670380d87e9-415x250-IndiaHerald.jpgతాజాగా ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో దీర్ఘకాలం పొదుపు చేస్తే మూడు రెట్ల రిటర్న్స్ లభిస్తాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల పాటు రూ.15 లక్షలు పొదుపు చేసినట్లయితే. 15 సంవత్సరాల నిర్ణీత కాలం ముగిసే సరికి రూ.45 లక్షల వరకు రిటర్న్స్ లభిస్తాయి. అంటే రూ.30 లక్షల లాభాన్ని పొందవచ్చు. BABY GIRLS; PARENTS{#}Sukanya;central government;Girl;Parents;marriageMoney: ఆడపిల్లల తల్లిదండ్రులకు శుభవార్త.. మూడు రెట్లు లాభం..!Money: ఆడపిల్లల తల్లిదండ్రులకు శుభవార్త.. మూడు రెట్లు లాభం..!BABY GIRLS; PARENTS{#}Sukanya;central government;Girl;Parents;marriageSun, 20 Aug 2023 11:00:00 GMTతాజాగా ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో దీర్ఘకాలం పొదుపు చేస్తే మూడు రెట్ల రిటర్న్స్ లభిస్తాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల పాటు రూ.15 లక్షలు పొదుపు చేసినట్లయితే. 15 సంవత్సరాల నిర్ణీత కాలం ముగిసే సరికి రూ.45 లక్షల వరకు రిటర్న్స్ లభిస్తాయి. అంటే రూ.30 లక్షల లాభాన్ని పొందవచ్చు.  

ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తూ 7.6% గా ఉన్న వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్స్ పెంచి ఎనిమిది శాతానికి చేసిన విషయం తెలిసిందే . అందుకే ఈ పథకంలో పొదుపు చేసిన వారికి రిటర్న్స్ కూడా భారీగా లభిస్తున్నాయి.  ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే.. ఆడపిల్లల పై చదువులు, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయడానికి ఈ పథకాన్ని వారి తల్లిదండ్రులు ఎంచుకుంటున్నారు. ఇందులో గరిష్టంగా ప్రతి సంవత్సరం రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. అంతేకాదు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 10 సంవత్సరాల వయసు లోపు ఉన్న అమ్మాయిలు ఇందులో చేరడానికి అర్హులవుతారు.  

ఉదాహరణకు ఈ పథకంలో ప్రతి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 15 లక్షలవుతుంది ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది శాతం ప్రకారం లెక్కించుకున్నట్లయితే అమ్మాయి వయసు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత సుమారుగా రూ.45 లక్షల రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ రిటర్న్స్ కి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలు వచ్చేవరకు పొదుపు చేసి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత డబ్బు విత్డ్రా చేయవచ్చు . లేదా 21 సంవత్సరల తర్వాత విత్ డ్రా చేస్తే ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దోమలను చంపేందుకు పెట్టిన మస్కిటో కిల్లర్.. నలుగురి ప్రాణం తీసింది?

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>