MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-bucchibabueaf41fb0-d984-4c1f-9e48-5cb2bd3611c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-bucchibabueaf41fb0-d984-4c1f-9e48-5cb2bd3611c8-415x250-IndiaHerald.jpgతాజాగా మెగా హీరోలకు సంబంధించి లేదా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది మెగా అభిమానులకు భారీ శుభవార్త అన్నట్టు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు మరొక శుభవార్త అందిందని చెప్పాలి. అసలు విషయంలోకెళితే.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా భారీ బడ్జెట్ను కేటాయించారు నిర్మాత దిRAM CHARAN; BUCCHIBABU{#}Ram Charan Teja;Kiara Advani;Pawan Kalyan;sana;vijay sethupathi;GEUM;RRR Movie;Vinaya Vidheya Rama;producer;Producer;shankar;News;Tamil;Telugu;Director;Heroine;Cinemaమెగా అభిమానులకు శుభవార్త.. బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలే..!మెగా అభిమానులకు శుభవార్త.. బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలే..!RAM CHARAN; BUCCHIBABU{#}Ram Charan Teja;Kiara Advani;Pawan Kalyan;sana;vijay sethupathi;GEUM;RRR Movie;Vinaya Vidheya Rama;producer;Producer;shankar;News;Tamil;Telugu;Director;Heroine;CinemaSun, 20 Aug 2023 09:00:00 GMTతాజాగా మెగా హీరోలకు సంబంధించి లేదా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది మెగా అభిమానులకు భారీ శుభవార్త అన్నట్టు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు మరొక శుభవార్త అందిందని చెప్పాలి. అసలు విషయంలోకెళితే.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా భారీ బడ్జెట్ను కేటాయించారు నిర్మాత దిల్ రాజు.

ఇక ఇందులో హీరోయిన్ గా వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ తో జతకట్టిన కియారా అద్వానీ మళ్ళీ ఈ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాదు తెలుగు అమ్మాయి ప్రముఖ హీరోయిన్ అంజలి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తవగానే రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.  వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.  ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఒకవైపు వేగంగా నడుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.  వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమాలో తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బుచ్చిబాబు విజయ్ సేతుపతి కోసం ఒక పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ ని ఈ సినిమా షేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దోమలను చంపేందుకు పెట్టిన మస్కిటో కిల్లర్.. నలుగురి ప్రాణం తీసింది?

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>