MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-yogi775525b4-8ce0-46c0-a79b-13ef101b090c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-yogi775525b4-8ce0-46c0-a79b-13ef101b090c-415x250-IndiaHerald.jpgసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా వివాదాల్లో ఇరుక్కున్నారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ సీఎం కాళ్ళకి ఆయన నమస్కారం పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు అసహనం వ్యక్తం చేస్తూ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్ తాజాగా శనివారం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు. అయితే మొదట ఆయనను చూడగానే రజినీకాంత్ వెళ్లి యోగి కాళ్లు మొక్కడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. 72 ఏళ్ల వయసున్న రజినీకాంత్ 51 ఏళ్లు ఉన్న యోగి కాళ్లకు నమస్కారం చేయడం ఏంటి అంటూ ఇప్పుడు పెద్ద వివాదంగా RAJINIKANTH; YOGI{#}Raccha;yogi;Saturday;CM;Chitram;Rajani kanth;Hero;India;Tamil;Cinemaరజినీకాంత్ చేసిన పనికి అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..!రజినీకాంత్ చేసిన పనికి అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..!RAJINIKANTH; YOGI{#}Raccha;yogi;Saturday;CM;Chitram;Rajani kanth;Hero;India;Tamil;CinemaSun, 20 Aug 2023 10:00:00 GMTసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా వివాదాల్లో ఇరుక్కున్నారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ సీఎం కాళ్ళకి ఆయన నమస్కారం పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు అసహనం వ్యక్తం చేస్తూ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్ తాజాగా శనివారం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు. అయితే మొదట ఆయనను చూడగానే రజినీకాంత్ వెళ్లి యోగి కాళ్లు మొక్కడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. 72 ఏళ్ల వయసున్న రజినీకాంత్ 51 ఏళ్లు ఉన్న యోగి కాళ్లకు నమస్కారం చేయడం ఏంటి అంటూ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

ముఖ్యంగా రజనీకాంత్ చేసిన ఈ పనిపై అభిమానులు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ ఇంటర్నేషనల్ గా మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ఇండియా మినహాయించి విదేశాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న ఈయన చాలాకాలంగా హిట్లు లేక ఆయన రేంజ్ తెలియలేదు కానీ తాజాగా జైలర్ సినిమాతో తన క్రేజ్ మరొకసారి నిరూపించుకున్నారు ఈ చిత్రం ఓవర్సీస్ లో దాదాపు రూ .200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం.

ఇక ఏ హీరో అభిమాని అయినా సరే సహజంగా రజనీకాంత్ కి ఫ్యాన్ అవ్వాల్సిందే. సినిమాకి అతీతంగా ఆయనను అభిమానించే వారు కూడా ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ ఇలా యోగి కాళ్లకు నమస్కారం చేయడం ఇప్పుడు పెద్ద రచ్చ లేపుతోంది. తన ఆత్మ గౌరవాన్ని సీఎం యోగి కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అభిమానులు, తమిళ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ చేసిన పని అత్యంత విచారకరంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది రజినీకాంత్ తన ఆత్మ గౌరవాన్ని తమిళనాడులోనే వదిలేశాడా ఏంటి అంటూ ట్రొల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'సలార్' మూవీలో హైలేట్ గా నిలిచే సీన్ అదే....!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>