DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/railways36a2072c-29db-46b7-a489-fd9b9225fec7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/railways36a2072c-29db-46b7-a489-fd9b9225fec7-415x250-IndiaHerald.jpgఇండియన్ రైళ్లలో రోజు ప్రయాణించే వారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. కానీ రైల్వే శాఖ మాత్రం ఆ ప్రయాణికుల భద్రతను మరిచిపోతుంది. ఇప్పటికే ఎన్నో రైళ్లలో దొంగతనాలు దోపిడీలు జరిగిన ఉదంతాలు కోకొల్లలు. అయితే దీనిపై రైల్వే పోలీసులు గాని రైల్వే శాఖ గాని సరైన తీరులో స్పందించదు అని అపవాది ఉంది. ఇలాంటి సందర్భంలో దొంగతనాలు జరిగి ఆ పోలీస్ దగ్గరికి వెళితే ఏ రైల్వే స్టేషన్ లో ఎక్కారు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎక్కడ పోయింది అని అడగడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుRAILWAYS{#}Thief;Traffic police;Chennai;Nellore;mallikarjun;gold;Hyderabad;policeరైళ్లలో యథేచ్చగా దోపిడీలు.. ఇంత దారుణమా?రైళ్లలో యథేచ్చగా దోపిడీలు.. ఇంత దారుణమా?RAILWAYS{#}Thief;Traffic police;Chennai;Nellore;mallikarjun;gold;Hyderabad;policeSat, 19 Aug 2023 06:00:00 GMTఇండియన్ రైళ్లలో రోజు ప్రయాణించే వారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. కానీ రైల్వే శాఖ మాత్రం ఆ ప్రయాణికుల భద్రతను మరిచిపోతుంది. ఇప్పటికే ఎన్నో రైళ్లలో దొంగతనాలు దోపిడీలు జరిగిన ఉదంతాలు కోకొల్లలు. అయితే దీనిపై రైల్వే పోలీసులు గాని రైల్వే శాఖ గాని సరైన తీరులో స్పందించదు అని అపవాది ఉంది.


ఇలాంటి సందర్భంలో దొంగతనాలు జరిగి ఆ పోలీస్ దగ్గరికి వెళితే ఏ రైల్వే స్టేషన్ లో ఎక్కారు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎక్కడ పోయింది అని అడగడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యదారిలో దిగి రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వారు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రైళ్లలో ప్రయాణికులకు వారి సామాన్లకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ చెన్నై వెళ్తుండగా నెల్లూరు సమీపంలో టెట్టు రైల్వే స్టేషన్ దగ్గరలో దోపిడి దొంగలు రైలు చైన్ లాగి  కిటికీల పక్కన కూర్చున్నటువంటి వారి బంగారాన్ని కొట్టేశారు. అంతే కాకుండా దాని వెనుక వస్తున్నటువంటి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ ని ఆపేందుకు ప్రయత్నించారు.


అయితే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించినటువంటి లోకో పైలట్లు లైట్లు వేసి దొంగలను గుర్తించే పని చేయడంతో వారు పారిపోయారు. అయితే బంగారాన్ని దొంగతనం చేసినటువంటి దొంగలు అదే రైలులో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. పక్క ప్లాన్ తో ఈ దొంగతనం చేశారని పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 30 తులాల వరకు బంగారం పోయినట్లు బాధ్యులు ఇచ్చిన కంప్లైంట్ లో తెలిపారు.


రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో పరిశీలించారు. ఈ దోపిడీకి చిక్క గ్యాంగ్ కారణమై ఉండొచ్చని రైల్వే డిఎస్పి మల్లికార్జున్ పేర్కొన్నారు. దొంగలని త్వరలోనే పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో మరోమారు రైళ్ల లో  ప్రయాణికుల భద్రతకు ముప్పు పొంచి ఉందని స్పష్టం అవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>