Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru0b10832a-549f-4990-ac1e-42a78f8357a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru0b10832a-549f-4990-ac1e-42a78f8357a3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇక సినిమాల విషయంలో ఎంత దూకుడుగా ముందుకు సాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు చిరంజీవి. మొన్నటికి మొన్న వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిరంజీవి.. బోళా శంకర్ అనే మూవీనితో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చిరంజీవి నటిస్తున్న కొన్ని సినిమాలు ప్రస్తుతం Chiru{#}udhayanidhi stalin;Stalin;Darsakudu;A R Murugadoss;Nijam;Director;Film Industry;Blockbuster hit;Chiranjeevi;shankar;Cinemaహిట్టిచ్చిన డైరెక్టర్ తో మెగాస్టార్ మూవీ.. ఇదే కావాలంటున్న ఫ్యాన్స్?హిట్టిచ్చిన డైరెక్టర్ తో మెగాస్టార్ మూవీ.. ఇదే కావాలంటున్న ఫ్యాన్స్?Chiru{#}udhayanidhi stalin;Stalin;Darsakudu;A R Murugadoss;Nijam;Director;Film Industry;Blockbuster hit;Chiranjeevi;shankar;CinemaSat, 19 Aug 2023 10:15:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇక సినిమాల విషయంలో ఎంత దూకుడుగా ముందుకు సాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు చిరంజీవి. మొన్నటికి మొన్న వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిరంజీవి.. బోళా శంకర్ అనే మూవీనితో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.


 చిరంజీవి నటిస్తున్న కొన్ని సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది. అయితే ఇక భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇక చిరంజీవి తన నెక్స్ట్ సినిమా ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన ఓ దర్శకులతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడట మెగాస్టార్ చిరంజీవి. ఆ దర్శకుడు ఎవరో కాదు మురగదాస్. మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట చిరంజీవి. ఇక స్టాలిన్ సినిమా లాగానే మరో సారి ఈ సినిమా సోషల్ మెసేజ్ తో రాబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక సినిమాకి ఇటీవల కాలం లో సెన్సేషన్ గా మారి పోయిన అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలి అంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబో రిపీట్ అయితే బాగుండని కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>