PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-kcr-congressddba35c7-0d71-4197-93f4-8f8278ebf7ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-kcr-congressddba35c7-0d71-4197-93f4-8f8278ebf7ca-415x250-IndiaHerald.jpgవార్నింగ్ ఇవ్వటమే కాకుండా ఒకటి, రెండుచోట్ల రేవంత్ పై పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు. దాంతో రేవంత్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపధ్యంలోనే పోలీసు సంఘంలో ఏమి మాట్లాడుకున్నారో తెలీదు. బుధవారం నుండి రేవంత్ గన్ మెన్లు విధులకు హాజరుకాలేదు. తాము డ్యూటీకి హాజరుకాబోమన్న విషయం మరి గన్ మెన్లు రేవంత్ కు చెప్పారో లేదో తెలీదు. చెప్పి మానేసినా, చెప్పకుండా మానేసినా బుధవారం నుండి గన్ మెన్లు లేకుండానే రేవంత్ బయట తిరిగేస్తున్నారు. Revanth KCR Congress{#}revanth;Congress;wednesday;Red;Government;policeహైదరాబాద్ : వివాదమైపోయిన రేవంత్ భద్రతహైదరాబాద్ : వివాదమైపోయిన రేవంత్ భద్రతRevanth KCR Congress{#}revanth;Congress;wednesday;Red;Government;policeSat, 19 Aug 2023 07:00:00 GMT 

వినటానికి నమ్మేట్లుగా లేదుకానీ నిజంగా ఇదే జరిగిందట. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డికి భారీ భద్రత ఉంది. అయితే ఈమధ్య పోలీసులపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల వివరాలన్నింటినీ రెడ్ డైరీలో రాసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక్కొక్కళ్ళ పనిచెబుతామని బెదిరించారు. అప్పటినుండి పోలీసు అధికారుల సంఘం నేతలకు రేవంత్ కు మధ్య వివాదం మొదలైంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని, బెదిరింపులు మానుకోకపోతే ఇబ్బందులు పడతారని పోలీసు సంఘం నేతలు గట్టి వార్నింగే ఇచ్చారు. భద్రతలేకుండా రేవంత్ తిరుగుతుండటం పెద్ద వివాదమైపోతోంది.



వార్నింగ్ ఇవ్వటమే కాకుండా ఒకటి, రెండుచోట్ల రేవంత్ పై పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు. దాంతో రేవంత్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపధ్యంలోనే పోలీసు సంఘంలో ఏమి మాట్లాడుకున్నారో తెలీదు. బుధవారం నుండి రేవంత్ గన్ మెన్లు విధులకు హాజరుకాలేదు. తాము డ్యూటీకి హాజరుకాబోమన్న విషయం మరి గన్ మెన్లు రేవంత్ కు చెప్పారో లేదో తెలీదు. చెప్పి మానేసినా, చెప్పకుండా మానేసినా బుధవారం నుండి గన్ మెన్లు లేకుండానే రేవంత్ బయట తిరిగేస్తున్నారు.



దాంతో కాంగ్రెస్ నేతలు గోల మొదలుపెట్టారు. రేవంత్ కు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. ఒకపుడు రేవంత్ భద్రతా విషయంపై పెద్ద గోలజరిగి విషయం న్యాయస్ధానంకు చేరింది. అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు సమాధానమిస్తు రేవంత్ భద్రతకు 69 మంది పోలీసులను నియమించినట్లు చెప్పింది. మరి అంతమంది డ్యూటీలు చేస్తున్నారో తెలీదు.



అయితే బుధవారం నాటికి రేవంత్ కు 2+2 భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చివరకు వాళ్ళు కూడా డ్యూటీకి రాకుండా మాయమైపోయినట్లు గోల మొదలైంది. ఇప్పటివరకు ప్రభుత్వంమీద అలిగి లేదా కోపంతోనో గన్ మెన్లను వెనక్కుపంపించిన నేతలను చూశాం. మొదటిసారి వీవీఐపీ దగ్గర డ్యూటీచేసేది లేదని చెప్పి విధులను బహిష్కరించిన  గన్ మెన్లను మొదటిసారి చూస్తున్నాం. మరి తాజా వివాదంపై ప్రభుత్వం ఎలా స్సందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>