PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-congress91c5fd47-d298-4e68-9085-02fd49f47013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-congress91c5fd47-d298-4e68-9085-02fd49f47013-415x250-IndiaHerald.jpgఇపుడు ప్రమాణపత్రం అందించి తర్వాత పార్టీమారితే ఏమిచేస్తారు ? అనే ప్రశ్నకు పీసీసీ నుండి ఎలాంటి సమాధానం లేదు. పార్టీలో ఉండాలా వద్దా అన్నది సదరు నేతల వ్యక్తిగతం. అంతేకానీ నిర్బంధంగా పార్టీలోనే ఉండేట్లుగా నేతలను ఎలా కట్టడి చేద్దామని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలుగుదేశంపార్టీలో నుండి వచ్చారు. చాలామంది నేతలు కాంగ్రెస్ లో నుండి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి పార్టీలో చేరారు. పార్టీలు మారటమన్నది నేతలకు చాలా కామన్ అన్న విషయం పీసీసీకి తెలీందేమీ కాదు. Revanth Congress{#}revanth;Application;Friday;Congress;Assemblyహైదరాబాద్ : టికెట్ల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయంహైదరాబాద్ : టికెట్ల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయంRevanth Congress{#}revanth;Application;Friday;Congress;AssemblySat, 19 Aug 2023 09:00:00 GMT 

తొందరలో జరగబోయే  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో దరఖాస్తులు చేసుకోవటానికి కాంగ్రెస్ కౌంటర్లు ఓపెన్ చేసింది. శుక్రవారం మొదలయ్యే దరఖాస్తుల స్వీకరణ 25వ తేదీతో ముగుస్తోంది. 119 నియోజకవర్గాల్లో పోటీచేయాలని అనుకుంటున్న ఆశావహులందరు దరఖాస్తులు చేసుకోవాల్సిందే అని  పీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటి స్పష్టంగా ప్రకటించింది. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే ఏమవుతుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఓసీ నియోజకవర్గాల్లో పోటీచేయాలని అనుకుంటున్న నేతలు దరఖాస్తు ఫీజుకింద రు. 50 వేలు చెల్లించాలి.



అలాగే రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటీచేయాలని అనుకుంటున్న వాళ్ళు దరఖాస్తుతో పాటు రు. 25 వేలు చెల్లించాలి. అయితే ఇక్కడే మరో విచిత్రమైన నిబంధన కూడా పీసీసీ పెట్టింది. అదేమిటంటే గెలిచినా, ఓడినా తాము పార్టీలోనే కంటిన్యు అవుతామని చెప్పి ప్రమాణపత్రాన్ని జతచేయాలట. దరఖాస్తులను తీసుకునేందుకు గాంధీభవన్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. దరఖాస్తులు ఓకే, దరఖాస్తు ఫీజులూ ఓకేనే కానీ ప్రమాణపత్రాలంటేనే నేతలంతా ఆశ్చర్యపోతున్నారు.



ఇపుడు ప్రమాణపత్రం అందించి తర్వాత పార్టీమారితే ఏమిచేస్తారు ? అనే ప్రశ్నకు పీసీసీ నుండి ఎలాంటి సమాధానం లేదు. పార్టీలో ఉండాలా వద్దా అన్నది సదరు నేతల వ్యక్తిగతం. అంతేకానీ నిర్బంధంగా పార్టీలోనే ఉండేట్లుగా నేతలను ఎలా కట్టడి చేద్దామని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలుగుదేశంపార్టీలో నుండి వచ్చారు. చాలామంది నేతలు కాంగ్రెస్ లో నుండి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి పార్టీలో చేరారు. పార్టీలు

మారటమన్నది నేతలకు చాలా కామన్ అన్న విషయం పీసీసీకి తెలీందేమీ కాదు.



నాగం జనార్ధనరెడ్డి లాంటి సీనియర్లు కూడా టీడీపీలో నుండే వచ్చారు. దరఖాస్తు చేసుకోవటానికి నాగం లాంటి అనేకమంది సీనియర్లు చిన్నతనంగా భావిస్తున్నారు. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి. అలాగే పోటీచేసే విషయంలో చిత్తశుద్ది ఉన్న నేతలే డబ్బులు కట్టి దరఖాస్తులు చేస్తారని పీసీసీ అనుకుంటున్నది.  రిజర్వుడు నియోజకవర్గాల్లో తక్కువే కానీ ఓపెన్ కేటగిరి నియోజకవర్గాల్లోనే టికెట్ల కోసం  చాలా పోటీ ఉంది. అన్నీ నియోజకవర్గాల్లో కలిపి సుమారు 60 నియోజకవర్గాల్లో పెద్ద పోటీ ఉండదని మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉందని పీసీసీ అనుకుంటోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>