SpiritualityChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tirumala1911c0af-5c49-43c0-8a48-a89672c4d2db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tirumala1911c0af-5c49-43c0-8a48-a89672c4d2db-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుదేవ స్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదం చెలరేగుతూనే ఉంది. మొదటగా ఆయన క్రిస్టియన్ మతానికి చెందిన వారని ఆయన కూతురు వివాహం కూడా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని సోషల్ మీడియాతో పాటు పలువురు ఆయనపై విమర్శలు కురిపించారు. ఈ వివాదం సద్దుమణిందనే లోపు తిరుమల కాలినడకపైన చిన్నారిని చిరుతపులి నోట కరుచుకు వెళ్లి చంపేయడంతో ఒక్కసారిగా టీటీడీపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశTIRUMALA{#}BHUMANA KARUNAKAR REDDY;Tirupati;Sri Venkateswara swamy;Tirumala Tirupathi Devasthanam;Chirutha;Serviceతిరుమలపై అడుసు తొక్కనేల.. కాలుకడగ నేల?తిరుమలపై అడుసు తొక్కనేల.. కాలుకడగ నేల?TIRUMALA{#}BHUMANA KARUNAKAR REDDY;Tirupati;Sri Venkateswara swamy;Tirumala Tirupathi Devasthanam;Chirutha;ServiceSat, 19 Aug 2023 10:00:00 GMTతిరుమల తిరుదేవ స్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదం చెలరేగుతూనే ఉంది. మొదటగా ఆయన క్రిస్టియన్ మతానికి చెందిన వారని ఆయన కూతురు వివాహం కూడా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని సోషల్ మీడియాతో పాటు పలువురు ఆయనపై విమర్శలు కురిపించారు.


ఈ వివాదం సద్దుమణిందనే లోపు తిరుమల కాలినడకపైన చిన్నారిని చిరుతపులి నోట కరుచుకు వెళ్లి చంపేయడంతో ఒక్కసారిగా టీటీడీపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మరుసటి రోజే చిరుతను బోనులో బంధించిన సిబ్బంది ప్రజలకు భయాన్ని పోగొట్టే చర్యలు చేపట్టింది. అయితే  కాలినడకన వెంకన్న సన్నిధిని చేరుకోవాలనుకునే భక్తులకు చిరుత పులి లేదా ఏదైనా అటవీ జంతువుల నుంచి రక్షణ కోసం కర్రలు ఇవ్వాలని నిర్ణయించింది.


అదే విధంగా ఆ కర్రల్ని పట్టుకుని కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లాలని చెప్పారు. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా చిన్నప్పుడు అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల మార్గం అంతటా బోడిగుండులా ఉండేదని అసలు ఏ మాత్రం అటవీ లేదు. చిరుత పులులు ఉండేవి కావన్నారు. దీంతో మరోమారు భూమనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల చుట్టూ చిట్టడవి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.


50, 60 ఏళ్ల కిందట తిరుమల ఎలా ఉందో చూపిస్తూ ఫోటోలు, వీడియోలు పెడుతూ టీటీడీ చైర్మన్ పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో సేవ చేసే భాగ్యం కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. తిరుమల చుట్టూ బోడి గుండు అనే మాటతో ఆయన పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని విమర్శిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>