Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh9fea45a8-2138-47b7-b0e5-86c3591fcfe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh9fea45a8-2138-47b7-b0e5-86c3591fcfe9-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఈ మెగాటోర్నని ఆడబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన రికార్డు ఉన్న రోహిత్ శర్మ అటు ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టును విశ్వవిజేతగా నిలుపుతాడ అనే విషయం పైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంతమంది ఇక రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యం పై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికరRohirh{#}Rohit Sharma;Shreyas Iyer;Shoaib Akhtar;Pakistan;World Cup;VIRAT KOHLI;rahul;Rahul Sipligunj;Indiaరోహిత్ కెప్టెన్సీ పై.. నాకు అదొక్కటే అనుమానం : పాక్ మాజీరోహిత్ కెప్టెన్సీ పై.. నాకు అదొక్కటే అనుమానం : పాక్ మాజీRohirh{#}Rohit Sharma;Shreyas Iyer;Shoaib Akhtar;Pakistan;World Cup;VIRAT KOHLI;rahul;Rahul Sipligunj;IndiaSat, 19 Aug 2023 18:30:00 GMTఈ ఏడాది భారత వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఈ మెగాటోర్నని ఆడబోతుంది టీమ్ ఇండియా.  ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన రికార్డు ఉన్న రోహిత్ శర్మ అటు ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టును విశ్వవిజేతగా నిలుపుతాడ అనే విషయం పైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంతమంది ఇక రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యం పై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ కెప్టెన్సీ పై తనకు అనుమానం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. రోహిత్ ను చూసినప్పుడల్లా నాకు ఒకే అనుమానం కలుగుతుంది. నిజంగా రోహిత్ ఇష్టపూర్వకంగానే టీమ్ ఇండియా కెప్టెన్సీ ని అందుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ ఎన్నో సందర్భాల్లో టెన్షన్ పడటం ఒత్తిడికి లోను కావడం చూశాను. అయితే కెప్టెన్సీ ప్రెజర్ రోహిత్ టాలెంట్ ని పూర్తిగా తినేస్తుంది. కోహ్లీ కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు. అందుకే కెప్టెన్గా ఐసీసీ టోర్నమెంట్స్ గెలవలేకపోయాడు  ఒక బ్యాటర్ గా రోహిత్ శర్మ దగ్గర విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ షాట్స్ ఉన్నాయి. టెక్నికల్ గా కూడా అతను గొప్ప బ్యాట్స్మెన్. క్లాసిక్ షాట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు.


 కానీ ఎందుకో కెప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మలో అంత ఫైర్ కనిపించడం లేదు. అంతే కాకుండా కెప్టెన్సీ కారణంగా అతను స్వేచ్ఛగా ఆడ లేక వరుసగా విఫలమవుతున్నాడు. ఇక మరో విషయం వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన టీం రోహిత్ దగ్గర లేదు. రాహుల్ గాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అందుబాటులో లేడు. వన్డేలో బాగా ఆడిన ప్లేయర్లు అందరూ కొంతకాలంగా ఏదో కారణంతో టీం కి దూరంగానే ఉన్నారు. ఒకవేళ రోహిత్ వన్డే వరల్డ్ కప్ గెలిచి.. నా అభిప్రాయం తప్పని నిరూపిస్తే మంచిదే. అయితే అతను ఆ పని చేయగలడ అనేది నాకు అనుమానం. 130 కోట్ల మంది భారత ప్రజల కలను మోయడం అంటే అది అదనపు ప్రెషర్ అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అవకాశాలు లేక గ్లామర్ షో చేస్తున్న పూజ హెగ్డే...!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>