Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledce30d38-5288-4fd1-831e-810454637776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledce30d38-5288-4fd1-831e-810454637776-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో రాణిస్తూ స్టార్‌గా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు.అయితే, గత ఏడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత ఈ మెగా హీరో కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, 'విరూపాక్ష'తో బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సాయి తేజ్ ఓ నెటిజన్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూడండి. సుప్రీమ్ హsocialstars lifestyle{#}Swati;sai dharam tej;swathi;vijaya krishna;niharika konidela;allari naresh;Naresh;Athadu;Army;Supreme;Accident;Success;media;Chiranjeevi;Hero;satyaఆ కారణంగా నెటిజన్ పై సీరియస్ ఐనా సాయి ధరమ్ తేజ్....!!ఆ కారణంగా నెటిజన్ పై సీరియస్ ఐనా సాయి ధరమ్ తేజ్....!!socialstars lifestyle{#}Swati;sai dharam tej;swathi;vijaya krishna;niharika konidela;allari naresh;Naresh;Athadu;Army;Supreme;Accident;Success;media;Chiranjeevi;Hero;satyaSat, 19 Aug 2023 19:02:00 GMTమెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో రాణిస్తూ స్టార్‌గా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు.అయితే, గత ఏడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత ఈ మెగా హీరో కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, 'విరూపాక్ష'తో బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సాయి తేజ్ ఓ నెటిజన్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూడండి.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత 'విరూపాక్ష' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. అయితే, దీని తర్వాత అతడు నటించిన 'బ్రో' మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకోలేకపోయింది. ఫలితంగా సాయి తేజ్‌కు నిరాశే ఎదురైంది.వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఇటీవలే 'సత్య'  'The Soul Of Satya' అనే కవర్ సాంగ్‌తో వచ్చాడు. ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ పాటలో కలర్స్ స్వాతి కూడా కనిపించింది. ఆర్మీ సోల్జర్స్‌కు, వాళ్లను వెనక ఉండి నడిపించే మహిళలకు ఈ సాంగ్‌ను అంకితం ఇచ్చారు.

ఫీల్ గుడ్ కంటెంట్‌తో వచ్చిన The Soul Of satya వీడియో సాంగ్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో సాయి ధరమ్ తేజ్ - స్వాతి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మొత్తంగా ఈ పాట అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయింది.తన స్నేహితుడైన నవీన్ విజయ కృష్ణ దర్శకత్వంలో సాయి తేజ్ చేసిన The Soul Of satya వీడియో సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీన్ని సినీ సెలెబ్రిటీలు కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. మెగా డాటర్ నిహారిక 'దీన్ని చూడడానికి వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది.

 'సత్య' సాంగ్‌ గురించి సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన పోస్టుకు నిహారిక కామెంట్ చేయగా.. ఆమెకు ఓ నెటిజన్ ఊహించని రిప్లై ఇచ్చాడు. అందులో 'వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపాయే' అంటూ అసభ్యంగా కామెంట్ చేశాడు. దీంతో ఇది చూసిన మెగా అభిమానులకు మండిపోయింది. ఆ వెంటనే అతడిని టార్గెట్ చేస్తూ చాలా మంది రిప్లైలు కూడా ఇచ్చారు.నిహారికను అవమానించేలా నెటిజన్ చేసిన కామెంట్‌కు సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'మైండ్ యువర్ టంగ్.. ఆ కామెంట్‌ను వెంటనే డిలీట్ చెయ్' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సదరు నెటిజన్ తన కామెంట్ తీసేశాడు. ఆ తర్వాత సాయి తేజ్ కూడా డిలీట్ చేశాడు. కానీ, ఈ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అవకాశాలు లేక గ్లామర్ షో చేస్తున్న పూజ హెగ్డే...!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>