MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntrd071c589-0a7b-49e7-9644-1acac6f9a644-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntrd071c589-0a7b-49e7-9644-1acac6f9a644-415x250-IndiaHerald.jpgజూనియర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘దేవర’ మూవీ పై చాల భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రియల్ 5వ తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీని ఖచ్చితంగా బ్లాక్ బష్టర్ హిట్ చేయాలి అన్న కసితో కొరటాల ఈమూవీని తీస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈసినిమా విడుదల తేదీని చాల కాలం క్రితం ప్రకటించారు. అప్పట్లో ఈసినిమాకు పోటీగా మరొక సినిమా వస్తుంది అన్న లీకులు లేకపోవడంతో రాబోతున్న సమ్మర్ సీజన్ ప్రారంభం జూనియర్ ఎన్టీఆర్ మ్యానియాతో మొదలవుతుందని అతడి అభిమానులు ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకుJUNIOR NTR{#}Saif Ali Khan;koratala siva;Allu Arjun;Jr NTR;kalyan;Sea;shankar;India;Cinemaకార్నర్ అవుతున్న దేవర !కార్నర్ అవుతున్న దేవర !JUNIOR NTR{#}Saif Ali Khan;koratala siva;Allu Arjun;Jr NTR;kalyan;Sea;shankar;India;CinemaFri, 18 Aug 2023 08:09:39 GMTజూనియర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘దేవర’ మూవీ పై చాల భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రియల్ 5వ తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీని ఖచ్చితంగా బ్లాక్ బష్టర్ హిట్ చేయాలి అన్న కసితో కొరటాల ఈమూవీని తీస్తున్న విషయం తెలిసిందే.



వాస్తవానికి ఈసినిమా విడుదల తేదీని చాల కాలం క్రితం ప్రకటించారు. అప్పట్లో ఈసినిమాకు పోటీగా మరొక సినిమా వస్తుంది అన్న లీకులు లేకపోవడంతో రాబోతున్న సమ్మర్ సీజన్ ప్రారంభం జూనియర్ ఎన్టీఆర్ మ్యానియాతో మొదలవుతుందని అతడి అభిమానులు ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ‘దేవర’ మూవీని అనేక భారీ సినిమాలు టార్గెట్ చేస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి.



పవన్ కళ్యాణ్ సుజిత్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘ఓజీ’ మూవీని ఏప్రిల్ బరిలో దించాలని చూస్తున్నారట. అదేవిధంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప 2’ కూడ ఏప్రియల్ నెల విడుదల తేదీ పై కార్నర్ చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. అదేవిధంగా  శంకర్  కమల్  హాసన్ ల భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’  కూడ ఏప్రియల్ లో రిలీజ్ అంటున్నారు. ఇలా భారీ సినిమాలు అన్నీ వచ్చే సంవత్సరం ఏప్రియల్ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో జూనియర్ కొరటాల ప్రాజెక్ట్ ‘దేవర’ కొంతవరకు కార్నర్ అయ్యే ఆస్కారం ఉంది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.



ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘దేవర’ సినిమాలో భైర అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ లుక్ విడుదల చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఎత్తైన కొండలు సముద్రం పడవలు చూపిస్తూ ఈసినిమా మొత్తం సముద్రం బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందనే విషయాన్ని తెలియ చేస్తున్నారు. ఒక ద్వీపం నేపథ్యంలో కొరటాల వ్రాసిన ఈకథకు సముద్రమే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>