Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea87b8d89-02a4-4949-859e-04a432f59018-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea87b8d89-02a4-4949-859e-04a432f59018-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షాగా దశాబ్దాల తరబడి ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు షారుక్ ఖాన్. కానీ అంతటి హీరోపై కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా మండిపడుతున్నాడు.బాలీవుడ్ ను మొత్తం నాశనం చేసేశాడని వివేక్ అనడం గమనార్హం. అతడు తన ఫేవరెట్ హీరో అంటూనే ఈ కామెంట్స్ చేశాడు."నేను షారుక్ ఖాన్ అభిమానినని మీకు తెలుసా? అతనిలాంటి చరిష్మా ఉన్న వ్యక్తి మరొకరు లేరని చెబుతుంటాను. కానీ షారుక్ ఖాన్ రాజకీయాలు నాకు నచ్చవు. బాలీవుడ్ లాంటి గొప్ప ఇండస్ట్రీని నాశనం చేయడానికి అతనిsocialstars lifestyle{#}vivek;Shakti;Athadu;Traffic police;war;Director;India;Hero;Cinema;politics;bollywood;Yevaruబాలీవుడ్ బాద్షా పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్....!!బాలీవుడ్ బాద్షా పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్....!!socialstars lifestyle{#}vivek;Shakti;Athadu;Traffic police;war;Director;India;Hero;Cinema;politics;bollywood;YevaruFri, 18 Aug 2023 20:53:00 GMTబాలీవుడ్ బాద్ షాగా దశాబ్దాల తరబడి ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు షారుక్ ఖాన్. కానీ అంతటి హీరోపై కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా మండిపడుతున్నాడు.బాలీవుడ్ ను మొత్తం నాశనం చేసేశాడని వివేక్ అనడం గమనార్హం. అతడు తన ఫేవరెట్ హీరో అంటూనే ఈ కామెంట్స్ చేశాడు."నేను షారుక్ ఖాన్ అభిమానినని మీకు తెలుసా? అతనిలాంటి చరిష్మా ఉన్న వ్యక్తి మరొకరు లేరని చెబుతుంటాను. కానీ షారుక్ ఖాన్ రాజకీయాలు నాకు నచ్చవు. బాలీవుడ్ లాంటి గొప్ప ఇండస్ట్రీని నాశనం చేయడానికి అతనిలాంటి వాళ్లే బాధ్యులని నేను భావిస్తాను. బాలీవుడ్ లో అన్నింటినీ నాశనం చేశారు. ఇప్పుడంతా పబ్లిక్ రిలేషన్లూ, హైప్, గ్లామర్, స్టార్‌డమ్. అసలు స్టార్‌డమ్ కానిదాన్ని అంగీకరిస్తున్నారు. అదీ నా సమస్య" అని ఇండియా డాట్ కామ్‌తో మాట్లాడుతూ వివేక్ అన్నాడు.

అసలు షారుక్ ఖాన్ సినిమాలు ప్రజల సినిమాలు కాదని, వాళ్లకేమీ తెలియదని అతడు భావిస్తాడని కూడా వివేక్ అగ్నిహోత్రి అనడం విశేషం. "నా రెండో అతిపెద్ద సమస్య సామాన్యమైనది. ప్రేక్షకులకు ఏమీ తెలియదని వాళ్లు అనుకుంటారు. దీనిని నేను భరించలేను. నేను ప్రజల సినిమాలు తీస్తాను. వాళ్లు బాక్సాఫీస్ సినిమా తీస్తారు. సినిమా సక్సెస్ అయితే అది షారుక్ ఖాన్ సినిమా. నా సినిమా సక్సెసైతే అది ప్రజల సినిమా. అందువల్ల మేము భిన్న ధృవాలపై నిల్చొన్నాం. అయినా అతడంటే ఇష్టం. శక్తి లేదా దీవార్ సినిమాల్లోలాగా.. అందులో తండ్రి, సోదరుడు ఇద్దరూ ఇష్టమే. వాళ్లలో ఒకరు పోలీస్ అయితే మరొకరు స్మగ్లర్. మాలో ఎవరు పోలీస్ ఆఫీసరో, ఎవరో స్మగ్లరో మీరే నిర్ణయించండి" అని వివేక్ అన్నాడు.

అంతేకాదు షారుక్ ఖాన్ తో సినిమా తీయడానికి కూడా తాను సిద్ధమే అని, అతడు తనలాగా పని చేస్తానంటే ఎలాంటి సమస్య లేదని కూడా వివేక్ అగ్నిహోత్రి అనడం విశేషం. ఒకవేళ అతడు తన సినిమాలో నటిస్తే రైటర్, డైరెక్టరే ముందుంటారని, షారుక్ వెనకాలే ఉండాలని కూడా స్పష్టం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం రేపిన వివేక్.. త్వరలోనే ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>