Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc80da48e0-06d0-4e51-9ae4-7ae4a0ed8cc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc80da48e0-06d0-4e51-9ae4-7ae4a0ed8cc7-415x250-IndiaHerald.jpgవన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి అన్ని జట్లు బలంగా ఉన్నాయి. ఏ జట్టు కప్ కొడుతుందో చివరి వరకు చెప్పలేం. ఈసారి టీం ఇండియా ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. 2023 ప్రపంచకప్ స్వదేశంలోనే జరుగుతుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీ గురించి ఇప్పటికే డిబేట్ లు కూడా మొదలయ్యాయి. కొందరు క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే ఏ జట్టు ఫేవరెట్, ఏ జట్టు సెమిస్ లకి వెళ్తాయి, ఏ జట్టు బలంగా ఉంది ఇలా ముందే అంచనాలు వేసేస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డిIcc{#}VIRAT KOHLI;South Africa;Cricket;India;World Cupప్రపంచకప్‌ లో ఈ జట్లే సెమిస్ కి వెళ్తాయి.. డివిలియర్స్ జోస్యం?ప్రపంచకప్‌ లో ఈ జట్లే సెమిస్ కి వెళ్తాయి.. డివిలియర్స్ జోస్యం?Icc{#}VIRAT KOHLI;South Africa;Cricket;India;World CupFri, 18 Aug 2023 18:15:00 GMTవన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. దీంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి అన్ని జట్లు బలంగా ఉన్నాయి. ఏ జట్టు కప్ కొడుతుందో చివరి వరకు చెప్పలేం. ఈసారి టీం ఇండియా ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. 2023 ప్రపంచకప్ స్వదేశంలోనే జరుగుతుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీ గురించి ఇప్పటికే డిబేట్ లు కూడా మొదలయ్యాయి. కొందరు క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే ఏ జట్టు ఫేవరెట్, ఏ జట్టు సెమిస్ లకి వెళ్తాయి, ఏ జట్టు బలంగా ఉంది ఇలా ముందే అంచనాలు వేసేస్తున్నారు. తాజాగా  సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మెగా టోర్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ప్రపంచకప్ లో ఏ జట్లు సెమిస్ కి వెళ్తాయి అనేది అంచనా వేసాడు. వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడని, కోహ్లీ రాణిస్తే ఇండియా టైటిల్ గెలిచే అవకాశం ఉందని చెప్పాడు. కోహ్లీ ఆటపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈసారి వన్డే ప్రపంచకప్ లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరుతాయి. ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉంది అని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.

డివిలియర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడిని MR 360 అని కూడా అందరు పిలుస్తుంటారు. ఇండియాలో కూడా డివిలియర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్సిబి తరపున కూడా చాలా మ్యాచులు ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ సమయంలోనే కోహ్లీతో మంచి బంధం ఏర్పడింది. డివిలియర్స్ ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా, ఆర్సిబి జట్టులో ఆడాడు కానీ ఒక్కసారి కూడా కప్ ని ముద్దాడలేకపోయాడు. డివిలియర్స్ కోహ్లీ గురించి మాట్లాడుతూ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతని బ్యాటింగ్ ని ఆస్వాదిస్తానని, కోహ్లీ ఒక గొప్ప వ్యక్తి అని, జట్టును ఎప్పుడు ముందుండి నడిపించడమే కాదు ఎప్పుడు మోటివేట్ చేస్తుంటాడని డివిలియర్స్ చెప్పాడు. తను ఎప్పుడు ఆర్సిబికి సపోర్ట్ చేస్తానని, ఆర్సిబిరథో కలిసి పని చేయాలనే కోరిక కూడా ఉందని చెప్పాడు. త్వరలోనే భారత్ కి రానున్నట్టు, ఇండియాలో అనాధ పిల్లలను ఆదుకుంటానని చెప్పాడు. భవిష్యత్తులో పేదవారి కోసం మేం భారత్‌లో ఇళ్లు కూడా నిర్మించాలనుకుంటున్నాం అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>