Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varundadcbc2b-e89f-4ff1-9534-beed279d5beb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varundadcbc2b-e89f-4ff1-9534-beed279d5beb-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే నటీనటుల సినిమా అప్డేట్ల గురించి మాత్రమే కాదు అటు పర్సనల్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఎంతోమంది తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఇక ఏదైనా చిన్న విషయం బయటకు వచ్చింది అంటే చాలు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ కు సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ హాVarun{#}varun sandesh;varun tej;Goodachari;prema;Love Story;arjuna;Yevaru;marriage;Heroine;Love;Hero;Cinemaఅందుకే.. ఇన్నాళ్లు నా ప్రేమ విషయం దాచా : వరుణ్ తేజ్అందుకే.. ఇన్నాళ్లు నా ప్రేమ విషయం దాచా : వరుణ్ తేజ్Varun{#}varun sandesh;varun tej;Goodachari;prema;Love Story;arjuna;Yevaru;marriage;Heroine;Love;Hero;CinemaFri, 18 Aug 2023 09:00:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే నటీనటుల సినిమా అప్డేట్ల గురించి మాత్రమే కాదు అటు పర్సనల్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఎంతోమంది తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఇక ఏదైనా చిన్న విషయం బయటకు వచ్చింది అంటే చాలు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ కు సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో కొనసాగుతున్నాడని.. ఎన్నో రోజులపాటు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ నుంచి గానీ ఇటు లావణ్య, వరుణ్ గాని ఎవరు స్పందించలేదు. అయితే ఇది నిజమే అని నిరూపించే విధంగా ఏకంగా వీరిద్దరికీ పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు వరుణ్ తేజ్ లవ్ మేటర్ గాసిప్ అనుకున్నాం. కానీ ఇది నిజమే అని క్లారిటీ వచ్చింది అని అందరూ అనుకున్నారు. అయితే ఇక వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తన ప్రేమ గురించి ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరుణ్ తేజ్.


 వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఈ మెగా హీరో  ఎక్కడికి వెళ్ళినా తన లవ్ స్టోరీ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరుణ్. ఏకంగా ఇన్నాళ్లు తన లవ్ స్టోరీని సీక్రెట్ గా ఉంచడానికి కారణం ఏంటో చెప్పాడు. లావణ్య త్రిపాఠి కి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయితే నా పర్సనల్ విషయాలు ఎప్పుడు సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడతాను. అందుకే ప్రేమ గురించి ఎప్పుడూ బయట పెట్టలేదు. ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లికి కూడా ఎంతో సింపుల్గా చేసుకుంటా అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>