Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi5d15eae3-6df8-4c05-8a2a-63a346999af1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi5d15eae3-6df8-4c05-8a2a-63a346999af1-415x250-IndiaHerald.jpgజగపతి బాబు సినీ ప్రయాణం చాలా వైవిధ్యమైనది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో వచ్చి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం కల్పించుకున్నాడు. స్టార్ హీరోలందరూ యాక్షన్ సినిమాలు చేస్తుంటే, జగపతి బాబు, శ్రీకాంత్ మాత్రం కామెడీ సినిమాలు, ఫామిలీ డ్రామాస్ చేస్తూ మంచి విజయాలను, అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో జగపతి బాబుకు లేడీస్ లో ఉన్న ఫాలోయింగే వేరు. వీళ్ళ విజయాలను కాస్త పక్కన పెడితే...జగపతి బాబు వదులుకున్న ఒక అద్భుతమైన కథను శ్రీకాంత్ పట్టేసాడు. ఆJagapathi{#}CBN;Venkatesh;jagapati babu;srikanth;Wanted;Legend;Comedy;Success;Telugu;Cinemaజగపతి బాబు తన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే!జగపతి బాబు తన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే!Jagapathi{#}CBN;Venkatesh;jagapati babu;srikanth;Wanted;Legend;Comedy;Success;Telugu;CinemaThu, 17 Aug 2023 12:30:00 GMTజగపతి బాబు సినీ ప్రయాణం చాలా వైవిధ్యమైనది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో వచ్చి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం కల్పించుకున్నాడు. స్టార్ హీరోలందరూ యాక్షన్ సినిమాలు చేస్తుంటే, జగపతి బాబు, శ్రీకాంత్ మాత్రం కామెడీ సినిమాలు, ఫామిలీ డ్రామాస్ చేస్తూ మంచి విజయాలను, అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో జగపతి బాబుకు లేడీస్ లో ఉన్న ఫాలోయింగే వేరు.

వీళ్ళ విజయాలను కాస్త పక్కన పెడితే...జగపతి బాబు వదులుకున్న ఒక అద్భుతమైన కథను శ్రీకాంత్ పట్టేసాడు. ఆ విజయంతో ఒక మెట్టు ఎక్కేసాడు కూడా. జగపతి బాబు ఆ సినిమా వదులుకోకపోయి ఉంటె ఆయన కెరీర్ మరింత అద్భుతంగా సాగేదని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. ఆ కథ ఏమిటి అనుకుంటున్నారా? అదే ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన "ఆహ్వానం". ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. కానీ ఈ కథను మొదట కృష్ణారెడ్డి గారు జగపతి బాబుకు వినిపించారట. ఆయనకు ఈ కథ నచ్చింది కూడా. కానీ డేట్స్ కుదరక చేయలేకపోయారు. జగపతి బాబు కోసం వెయిట్ చెయ్యలేక ఈ కథను శ్రీకాంత్ తో తీసారట కృష్ణారెడ్డి.

ఇలా జగపతి బాబు వదులుకున్న సినిమా శ్రీకాంత్ పాలిట వరమైంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా పాటలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కాంబో మిస్ అయినా తరువాత మళ్ళి కృష్ణారెడ్డి, జగపతిబాబు కలిసి చాలా సినిమాలు చేసారు. మావిచిగురు, శుభలగ్నం వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం జగపతిబాబు తన సినీ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. లెజెండ్ తో విల్లన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సథరన్ ఫిలిం ఇండస్ట్రీస్ లో మోస్ట్ వాంటెడ్ విల్లన్. జగపతిబాబుకు ఎంతగానో కలిసొచ్చిన కృష్ణారెడ్డి గారు మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>