MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr0f5c5b8b-1fc1-47ae-b47e-bf87dcdc8a6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr0f5c5b8b-1fc1-47ae-b47e-bf87dcdc8a6f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతడి మ్యానియా తారా స్థాయికి చేరుకోవడంతో మన టాప్ హీరోలు కూడ తమ సినిమాలకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ తమన్ ల కంటే అనిరుధ్ కు ఓటు వేస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ షారూఖ్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమం నడుస్తోంది. ఇందులో భాగంగా విడుదలైన ఫస్ట్ లిరికల్ వీడియోకు పెద్దగా రెస్పాన్స్junior ntr{#}devi sri prasad;Sangeetha;kalyan;Jr NTR;koratala siva;Telugu;News;Director;Cinemaజవాన్ పాటలు విని బెదిరిపోతున్న జూనియర్ అభిమానులు !జవాన్ పాటలు విని బెదిరిపోతున్న జూనియర్ అభిమానులు !junior ntr{#}devi sri prasad;Sangeetha;kalyan;Jr NTR;koratala siva;Telugu;News;Director;CinemaThu, 17 Aug 2023 08:00:00 GMTప్రస్తుతం దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతడి మ్యానియా తారా స్థాయికి చేరుకోవడంతో  మన టాప్ హీరోలు కూడ తమ సినిమాలకు  సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ తమన్ ల కంటే అనిరుధ్ కు ఓటు వేస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ షారూఖ్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేస్తున్న విషయం  తెలిసిందే.  



ఇప్పటికే ఈ సినిమాకు  సంబంధించిన లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమం నడుస్తోంది. ఇందులో భాగంగా విడుదలైన ఫస్ట్ లిరికల్ వీడియోకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన రెండో లిరికల్ వీడియో విడుదల చేశారు. షారూఖ్ నయనతారల మధ్య వచ్చే యుగళ గీతం ఇది.   ఈ పాట అనిరుద్ స్టైల్ లో ఉంది. అయితే ఈపాటను రెండు మూడు సార్లు విన్నవారికి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ లోని పాటకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది అంటూ సోషల్  మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



ఇప్పుడు ఈకామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారు తెగ  టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ కొరటాల కాంబినేషన్ లో  రాబోతున్న ‘దేవర’ సినిమాకు జూనియర్  కొరటాల పై ఒత్తిడి చేసి అనిరుధ్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేయించాడు అని అంటారు. దీనికోసం అతడికి భారీ పారితోషికం ఇచ్చినట్లుగా వార్తలు కూడ వచ్చాయి. తన పాటలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో చాల మంచి పేరు తెచ్చుకున్న అనిరుధ్ తాను ట్యూన్ చేసే పాటల విషయంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనితో జూనియర్ ‘దేవర’ మూవీకి పాటల ట్యూన్స్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అంటూ తారక్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిల్లింగ్ లుక్స్ లో నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>