Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/baba83b3b361-a29d-40a3-8eeb-4e382266c69c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/baba83b3b361-a29d-40a3-8eeb-4e382266c69c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుతమైన ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఎంతోమంది లెజెండ్స్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ జట్టును కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం అతను లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఎప్పుడూ బాబర్ అజం తాను సాధించిన రికార్డుల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. Baba{#}Pakistan;Shaheen Bhatt;Babur;media;Success;Love;Girl;World Cup;marriage;Yevaruవరల్డ్ కప్ ముగిసిన తర్వాతే పెళ్లి.. బాబర్ డిసైడయ్యాడు?వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే పెళ్లి.. బాబర్ డిసైడయ్యాడు?Baba{#}Pakistan;Shaheen Bhatt;Babur;media;Success;Love;Girl;World Cup;marriage;YevaruThu, 17 Aug 2023 19:00:00 GMTప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అద్భుతమైన ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఎంతోమంది లెజెండ్స్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ జట్టును కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం అతను లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఎప్పుడూ బాబర్ అజం తాను సాధించిన రికార్డుల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.


 కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన కామెంట్స్ చేయడం ద్వారా కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఏకంగా మరో విషయంలో వార్తల్లో నిలిచాడు బాబర్ అజం. అదే అతని పెళ్లి విషయం. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కొనసాగుతున్న ఈ స్టార్ క్రికెటర్ భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఓ ఇంటి వాడు అవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఇలా వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇక మూడుముళ్ల బంధం లో అడుగుపెట్టబోతున్నాడట బాబర్. అయితే పెళ్లికి సంబంధించి ఇప్పటికే బాబర్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.



 దీంతో వధువు ఎవరు అని అందరూ సోషల్ మీడియా వేదికగా వెతకడం ప్రారంభించారు. ఇప్పటివరకు బాబర్ ఎవరితో లవ్ ఎఫైర్ నడిపింది కూడా లేదు. దీంతో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బాబర్ పెళ్లి చేసుకోబోయేది ఏకంగా వాళ్ళ బంధువుల అమ్మాయినే అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరకు బాబర్ ఫ్యామిలీ మాత్రం ఆ అమ్మాయి పేరు ఏంటి డీటెయిల్స్ ఏంటి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే పాకిస్తాన్ క్రికెటర్లలో చాలామంది పెళ్లి చేసుకున్నారు. హరీష్ రౌఫ్, యాసిర్ అలీ, షాహిన్ ఆఫ్రిది ఇలా స్టార్ ప్లేయర్లందరూ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు  ఇక ఇప్పుడు బాబర్ వంతు వచ్చిందని పాక్ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జిమ్ వర్కౌట్ ఫోటోలతో ఈషా రెబ్బ వయ్యారాలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>