TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nagarajuna55e233cc-a99f-47e0-a7a9-db3f858f34c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nagarajuna55e233cc-a99f-47e0-a7a9-db3f858f34c4-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పాలి. ఇక హౌస్ లోకి దాదాపు ఈసారి 16 మంది కంటెస్టెంట్లను తీసుకురాబోతున్నట్లు.. 106 రోజులపాటు ఈ షో ని కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి హోస్టుగా పలువురు హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరిగా నాగార్జున పేరు ఫైనల్ చేశారు. బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి ఆరవ సీBIGBOSS;NAGARAJUNA{#}Akkineni Nagarjuna;september;News;House;Bigboss;Audienceటీవీ: భారీగా డిమాండ్ చేస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే..?టీవీ: భారీగా డిమాండ్ చేస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే..?BIGBOSS;NAGARAJUNA{#}Akkineni Nagarjuna;september;News;House;Bigboss;AudienceThu, 17 Aug 2023 02:00:00 GMTతెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పాలి. ఇక హౌస్ లోకి దాదాపు ఈసారి 16 మంది కంటెస్టెంట్లను తీసుకురాబోతున్నట్లు.. 106 రోజులపాటు ఈ షో ని కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి హోస్టుగా పలువురు హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరిగా నాగార్జున పేరు ఫైనల్ చేశారు.

బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు. అంతేకాదు ఓటీటీ వెర్షన్ కి కూడా ఆయనే హోస్ట్  గా చేయడం జరిగింది. ఇప్పుడు ఏడవ సీజన్ నుంచి ఆయన తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చినా చివరికి ఆయనే చేస్తున్నట్లు ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఈ సీజన్ సెవెన్ కి భారీగా డిమాండ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూడవ సీజన్ కి రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న నాగార్జున ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లకు పైగానే పారితోషకం అడుగుతున్నట్లు సమాచారం.

నిర్వాహకులు కూడా వేరే ఎవరూ లేని పక్షంలో ఇప్పుడు నాగార్జునని తీసుకుంటున్నారు కాబట్టి ఆయన అడిగినంత ఇవ్వడానికి వీరు వెనకాడడం లేదు. వాస్తవానికి వారంలో శని, ఆదివారాలు మాత్రమే నాగార్జున మనకు స్క్రీన్ పై కనిపిస్తారు. మరి కేవలం 15 వారాలపాటు కొనసాగే ఈ షో కి దాదాపు రూ .20 కోట్లకు పైగా అడుగుతున్నారంటే ఇక ఏ రేంజ్ లో ఆయన డిమాండ్ చేస్తున్నారో అర్థం చేసుకో వచ్చు. ఏది ఏమైనా నాగార్జున ఈ షో ద్వారా ఈసారి భారీగానే వెనకేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : మూడు పేర్లు బయటకు వచ్చాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>