Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccee21e333-ad7d-4294-a19c-de9c66dade9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccee21e333-ad7d-4294-a19c-de9c66dade9a-415x250-IndiaHerald.jpgత్వరలోనే సొంతగడ్డపై వన్డే వరల్డ్ జరగనుంది. టీంఇండియా ఈసారి ఎలాగైనా కప్ గెలువాలని పట్టుదలతో ఉంది. కానీ జట్టులో ఉండేది ఎవరు అనేది మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు సమస్య మొత్తం వికెట్ కీపర్ ఎవరు అనేదే. రిషబ్ పంత్ ఆక్సిడెంట్ కి గురి కావడంతో ఇండియా జట్టుకు కీపర్ సమస్య ఎదురైంది. పంత్ తరువాత వికెట్ కీపర్లుగా ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. వారెవరో కాదు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్. అంతేకాదు గాయం నుంచి కోలుకున్న రాహుల్ కి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే ఇద్దరికీ ఒకరికే Icc{#}bharath;ishaan actor;rahul;srikar;Ishan Kishan;Sri Bharath;Rishabh Pant;Rahul Sipligunj;Yevaru;December;Indiaవరల్డ్ కప్‌ కు కీపర్ ఎవరు.. ఆ ఇద్దరి మధ్యే పోటీ?వరల్డ్ కప్‌ కు కీపర్ ఎవరు.. ఆ ఇద్దరి మధ్యే పోటీ?Icc{#}bharath;ishaan actor;rahul;srikar;Ishan Kishan;Sri Bharath;Rishabh Pant;Rahul Sipligunj;Yevaru;December;IndiaThu, 17 Aug 2023 12:15:00 GMTత్వరలోనే సొంతగడ్డపై వన్డే వరల్డ్ జరగనుంది. టీంఇండియా ఈసారి ఎలాగైనా కప్ గెలువాలని పట్టుదలతో ఉంది. కానీ జట్టులో ఉండేది ఎవరు అనేది మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు సమస్య మొత్తం వికెట్ కీపర్ ఎవరు అనేదే. రిషబ్ పంత్ ఆక్సిడెంట్ కి గురి కావడంతో ఇండియా జట్టుకు కీపర్ సమస్య ఎదురైంది. పంత్ తరువాత వికెట్ కీపర్లుగా ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. వారెవరో కాదు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్. అంతేకాదు గాయం నుంచి కోలుకున్న రాహుల్ కి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే ఇద్దరికీ ఒకరికే ఛాన్స్ వస్తుంది.

ఇషాన్ కిషన్, శాంసన్ ఒంటి చేత్తో మ్యాచ్ ని మార్చేయగలరు. కీపింగ్ కూడా అద్భుతంగా చేయగలరు. కానీ ఈ ఇద్దరికి అనుభవం కూడా కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇప్పటివరకు ఇషాన్ కిషన్ 16 వన్డేలు ఆడగా, శాంసన్ 13 వన్డేలు ఆడాడు. కానీ కొన్ని నెలలుగా శాంసన్ ఫామ్ లో లేకపోడం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత డిసెంబర్ లో అద్భుతమైన డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. తాజాగా జరిగిన వెస్ట్ ఇండీస్ టూర్ లో కూడా కిషన్ అద్భుతంగా రాణించాడు. వరుస హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో ఫామ్ ని కొనసాగించాడు. శాంసన్ ఒక హాఫ్ సెంచరీ చేసాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.

టెస్టుల్లో శ్రీకర్ భరత్ రాణించినప్పటికీ వన్డే ఫార్మాట్ లో భరత్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. పంత్ అంత వేగంగా ఆడలేకపోయాడు. అందులో అనుభం కూడా భరత్ కి లేకపోవడంతో మైనస్ అయ్యింది. దీంతో అనుభవం, బ్యాటింగ్ చేయగల ప్లేయర్ ల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇక రాహుల్ జట్టులోకి వస్తే అతడినే తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ వస్తే కిషన్, శాంసన్ లో ఒక్కరికే ఛాన్స్ దక్కుతుంది. ఇక గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ని తీసుకునే అవకాశం ఉంది. వెస్ట్ ఇండీస్ సిరీస్ లో శాంసన్ రాణించకపోవడంతో అతడిపై వేటు పడే ఛాన్స్ ఉంది. చూడాలి మరి వికెట్ కీపర్ కు సెలెక్టర్లు ఎవరికి ఛాన్స్ ఇస్తారో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోహ్లీ ఆ స్థానంలో అడిగితే బాగుంటుంది : రవి శాస్త్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>