Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7c12eead-9b50-498e-8ee9-6d6e4e6991cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7c12eead-9b50-498e-8ee9-6d6e4e6991cd-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ ముద్దుల మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ ఇక ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుప్రీం హీరోగా మారిపోయాడు సాయి ధరమ్ తేజ్. అయితే రోడ్డు ప్రమాదం బారిన పడిన సాయిధరమ్ తేజ్ గాయాలనుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వరుస సినిమాలతో జోరు చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరుపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చిన్న మామయ్య తెలుగు ప్రేక్Tollywood{#}Naresh;Swati;allari naresh;keerthi suresh;Pawan Kalyan;satya;swathi;Telugu;Blockbuster hit;Ishtam;Cinema;Directorవికే నరేష్ కొడుకు దర్శకత్వంలో.. సాయి ధరమ్ తేజ్ సినిమా?వికే నరేష్ కొడుకు దర్శకత్వంలో.. సాయి ధరమ్ తేజ్ సినిమా?Tollywood{#}Naresh;Swati;allari naresh;keerthi suresh;Pawan Kalyan;satya;swathi;Telugu;Blockbuster hit;Ishtam;Cinema;DirectorWed, 16 Aug 2023 08:15:00 GMTమెగాస్టార్ ముద్దుల మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ ఇక ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుప్రీం హీరోగా మారిపోయాడు సాయి ధరమ్ తేజ్. అయితే రోడ్డు ప్రమాదం బారిన పడిన సాయిధరమ్ తేజ్ గాయాలనుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వరుస సినిమాలతో జోరు చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరుపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చిన్న మామయ్య తెలుగు ప్రేక్షకుల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.


 అయితే సాయిధరమ్ తేజ్ గతంలో సత్యా అనే ఒక షార్ట్ ఫీచర్ ఫిలింలో నటించాడు   ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న నరేష్ కొడుకే ఇక ఈ షార్ట్ ఫీచర్ ఫిలిం కి దర్శకత్వం వహించాడట. అతని పేరు నవీన్ విజయకృష్ణ. నరేష్ తనయుడుగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఐనా ఇష్టం నువ్వు అనే టైటిల్ తో ఒక సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఊరంతా అనుకుంటున్నారు అంటూ మరో సినిమాలో కూడా కనిపించాడు.



 ఇలా రెండు సినిమాలు చేసిన ఎందుకో హీరోగా మాత్రం అతనికి మంచి గుర్తింపును రాలేదు. అయితే నవీన్ సాయి, ధరంతేజ్ ఒకే చోట చదువుకునేవారట. ఆ సమయంలో మంచి స్నేహితులకు కూడా. అలాగే కలర్స్ స్వాతి కూడా వీరికి స్నేహితురాలు. దీంతో ఈ ముగ్గురితో మరికొందరు స్నేహితులు కలిసి సత్య అని ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కించారు. సరిహద్దుల్లో ఉండే సైనికులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి త్యాగాలు చేస్తారు అనేది  చూపిస్తూ 23 నిమిషాలు ఉండే ఒక ఫిలిం తీయగా.. ఇందులో ఆరు నిమిషాల సాంగ్ ఉంటుంది. ఈ క్రమంలోని ఆగస్టు 15వ తేదీన మూవీలోని సాంగ్ రిలీజ్ చేశారు  అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>