Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaslar82495dc5-b78a-4d2e-8458-78e97abcd901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaslar82495dc5-b78a-4d2e-8458-78e97abcd901-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంతలా విమర్శలు రావడానికి కారణం జట్టు దారుణ వైఫల్యాన్ని చవిచూడటమే. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ లో ఎక్కడ వెస్టిండీస్కు పోటీ ఇవ్వలేకపోయింది టీమిండియా. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఇక 3-2 తేడాతో వెస్టిండీస్ చేతిలో టి20 సిరీస్ ను ఓడిపోయింది. అయితే అంతకుముందు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్లో కూడా సిరీస్ లు గెలిచిన టీమ్ ఇండియా అదే జోరును టి20 సిరీస్ లో మాత్రం చూపించలేకపోయింది. ఒకవైపు బౌలింగ్ విభాGavaslar{#}SUNIL GAVASKAR;INTERNATIONAL;ICC T20;West Indies;Indiaటి20 సిరీస్ ఓటమి అవమానం కాదు.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?టి20 సిరీస్ ఓటమి అవమానం కాదు.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Gavaslar{#}SUNIL GAVASKAR;INTERNATIONAL;ICC T20;West Indies;IndiaWed, 16 Aug 2023 12:30:00 GMTప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంతలా విమర్శలు రావడానికి కారణం జట్టు దారుణ వైఫల్యాన్ని చవిచూడటమే. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ లో ఎక్కడ వెస్టిండీస్కు పోటీ ఇవ్వలేకపోయింది టీమిండియా. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఇక 3-2 తేడాతో వెస్టిండీస్ చేతిలో టి20 సిరీస్ ను ఓడిపోయింది. అయితే అంతకుముందు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్లో కూడా సిరీస్ లు గెలిచిన టీమ్ ఇండియా అదే జోరును టి20 సిరీస్ లో మాత్రం చూపించలేకపోయింది.


 ఒకవైపు బౌలింగ్ విభాగం మరోవైపు బ్యాటింగ్ విభాగం కూడా వరుసగా వైఫల్యం చెందడంతో చివరికి గెలిచే అవకాశాలను పూర్తిగా చేజార్చుకుంది టీం ఇండియా. ఈ క్రమంలోనే టీ20 సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు టీమిండియా ప్లేయర్స్ ప్రదర్శన పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఇటీవలే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో టి20 సిరీస్ లో ఓటమి అవమానం కాదు అంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఇది ఒక మేలుకొలుపు అంటూ కామెంట్ చేశాడు గవాస్కర్.


 వెస్టిండీస్ తో టి20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లో ఓడిపోయినప్పుడు భారత జట్టు ప్రదర్శన పై ఆందోళన వ్యక్తం అయింది. కానీ అద్భుతంగా పోరాడి సిరీస్ ను సమం చేసింది. అయితే సుదీర్ఘ పర్యటనలో చివరి మ్యాచ్ వచ్చేసరికి మనమంతా స్వదేశానికి వెళ్లాలని విమానం పైనే ఆలోచన ఉంటుంది. ఫలితంగా తీవ్రత కాస్త తగ్గుతుంది. ఏదేమైనా సిరీస్లో కొంతమంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన సంగతి గుర్తుంచుకుంటే మంచిది. ఇక పూర్తిస్థాయి బలమైన భారత టీ20 జట్టు కాదు. కొన్ని ప్రదర్శనలు బాగున్నాయి. మరికొన్ని నిరాశపరిచాయ్ ఆటగాళ్లు దృక్పథంపై ప్రశ్నలు తలెత్తాయి. అంతర్జాతీయ మ్యాచ్ కంటే మరో పెద్ద పరీక్ష ఉండదు. ఇది టీమిండియా ప్లేయర్లకు ఒక మేలుకొలుపు లాంటిది అంత సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారంలో మహేష్ ఊర మాస్ అట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>