DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/lokesh61ab5f0d-cb8b-49cf-962a-27e2a7f99bc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/lokesh61ab5f0d-cb8b-49cf-962a-27e2a7f99bc8-415x250-IndiaHerald.jpgగతం నుండి తెలుగు దేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే‌. మొన్న పుంగనూరులోనూ, అంగళ్లూరులోనూ తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హత్యా ప్రయత్నం చేయడానికి చూశారని ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మధ్య రెడ్ డైరీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా నారా లోకేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముందస్తుగా హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అధికారంలోకి వస్తే అవతలి వాLOKESH{#}Telugu Desam Party;Nara Lokesh;Y. S. Rajasekhara Reddy;Murder;Murder.;Congress;Reddy;CBN;Party;Redలోకేశ్‌ రెడ్ డైరీ హెచ్చరికలతో అసలుకే మోసం?లోకేశ్‌ రెడ్ డైరీ హెచ్చరికలతో అసలుకే మోసం?LOKESH{#}Telugu Desam Party;Nara Lokesh;Y. S. Rajasekhara Reddy;Murder;Murder.;Congress;Reddy;CBN;Party;RedWed, 16 Aug 2023 09:00:00 GMTగతం నుండి తెలుగు దేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే‌. మొన్న పుంగనూరులోనూ, అంగళ్లూరులోనూ తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హత్యా ప్రయత్నం చేయడానికి చూశారని ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే.


అయితే ఈ మధ్య రెడ్ డైరీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా నారా లోకేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ముందస్తుగా హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అధికారంలోకి వస్తే అవతలి వాళ్ళ అంత చూస్తాం, ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై హత్య ప్రయత్నం చేసింది అనుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని రుజువు చేసి న్యాయబద్ధంగా వెళ్లాలి.


అంతే గాని కన్నుకు కన్ను అనే పద్ధతిలో వెళ్లడం మంచిది కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు. రెడ్ డైరీ అనేది గతంలో తీవ్ర వాదులు లేదా నక్సలైట్లు వాడే వాళ్ళని అంటున్నారు. ఆ లెక్కన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా నక్సలైట్ల విధంగానే  ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ఒక బుక్ మైంటైన్ చేస్తూ తాము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ  ఆస్తులను పంచి వేయడం జరగాలి కదా.


తాము రేపు అధికారంలోకి వస్తే అలా చేస్తాం అవతలి వాళ్ళ అంతు చూస్తాం అంటూ అవతలి పార్టీని హెచ్చరిస్తున్నారు టీడీపీ. అంటే దాని అర్థం అధికారం అనేది తమ రౌడీయిజాన్ని ఛలాయించుకోవడానికి ఉపయోగపడుతుంది అని  కాదు కదా. అలా అయితే అధికారం వచ్చిన తర్వాత రౌడీయిజం చేసే పద్ధతే ఉంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలోనే ఉన్నారు కదా. అలా అయితే వాళ్లు కూడా బెదిరించాలి కదా అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>