Businesspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tamatob4b64b90-3cb2-4ac9-b0fe-c2f1dca9de0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tamatob4b64b90-3cb2-4ac9-b0fe-c2f1dca9de0f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో నిత్యవసరాల ధరలు మాత్రమే కాదు అటు కూరగాయల ధరలు కూడా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే కూరగాయల ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతూ ఉంటే.. ఇక ఇటీవల పెరిగిపోయిన టమాటా ధర సామాన్యుడిని మరింత భయపెట్టింది. ఏకంగా 200 రూపాయలకు పైగానే కిలో పలకడంతో ఎంతో మంది సామాన్యులు టమాటా లేకుండానే వంటలను కాచ్చేశారు. ఇలా క్రమం క్రమంగా ఎర్రటి టమాటా సామాన్యుడి వంటగదికి పూర్తిగా దూరమైపోయింది. ఇక టమోటా రైతులు అయితే మునుపెన్నడూ లేని విధంగా లాభాలను ఆర్జించి కోటీశ్వరులుగTamato{#}Tamilnadu;Banana;Vijayadashamiపెరిగిన ధరలు : టమాట అయిపోయింది.. ఇప్పుడు మరొకటి?పెరిగిన ధరలు : టమాట అయిపోయింది.. ఇప్పుడు మరొకటి?Tamato{#}Tamilnadu;Banana;VijayadashamiWed, 16 Aug 2023 10:30:00 GMTఇటీవల కాలంలో నిత్యవసరాల ధరలు మాత్రమే కాదు అటు కూరగాయల ధరలు కూడా సామాన్యులను బెంబేలెత్తిస్తూ  ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే కూరగాయల ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతూ ఉంటే.. ఇక ఇటీవల పెరిగిపోయిన టమాటా ధర సామాన్యుడిని మరింత భయపెట్టింది. ఏకంగా 200 రూపాయలకు పైగానే కిలో పలకడంతో ఎంతో మంది సామాన్యులు టమాటా లేకుండానే వంటలను కాచ్చేశారు. ఇలా క్రమం క్రమంగా ఎర్రటి టమాటా సామాన్యుడి వంటగదికి పూర్తిగా దూరమైపోయింది.


 ఇక టమోటా రైతులు అయితే మునుపెన్నడూ లేని విధంగా లాభాలను ఆర్జించి కోటీశ్వరులుగా మారిపోయారు అని చెప్పాలి. అయితే క్రమక్రమంగా మార్కెట్లోకి టమాటా సరఫరా పెరిగిపోవడంతో ఇక రేట్లు అదుపులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు టమాట వంతు అయిపోయింది. మరొకటి సామాన్యులను భయపెట్టేందుకు సిద్ధమైంది. అదే అరటిపండు. ఇటీవలే బెంగళూరులో కేజీ అరటి పండు ధర ఏకంగా 100 రూపాయలకు చేరింది. దీంతో కొనుగోలుదారులు గగ్గోలు  పెడుతున్నారు. అయితే రైతుల నుంచి తగినంత సరఫరా లేకపోవడంతోనే అరటి పండ్లకు  మార్కెట్లో ఈ రేంజ్ లో డిమాండ్ ఏర్పడుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.


 అయితే బెంగళూరులో విక్రయించే అరటి పండ్లలో మెజారిటీగా తమిళనాడు నుంచి ఎక్కువగా సరఫరా అవుతూ ఉంటాయి. గతవారం తమిళనాడులోని ఎలక్కి బలే ప్రాంతం నుంచి 1500 క్వింటాళ్ల అరటిపండు వస్తే ఇప్పుడు 1000 క్వింటాలకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇలా సరఫరా తగ్గిపోవడంతో హోల్సేల్ లో  అరటి పండ్లు కేజీ 78 రూపాయలు పలుకుతూ ఉండగా.  అన్ని ఖర్చులు కలుపుకొని వ్యాపారులు కేజీ ₹100 వరకు విక్రయిస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇక వినాయక చవితి విజయదశమి పండుగలు ఉన్న నేపథ్యంలో ఈ ధరలు  మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్యుడికి ఇప్పుడు అరటిపండు కూడా భారంగా మారనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>