EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress6fde7f4d-e2db-4a40-8152-1f6df78e273a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congress6fde7f4d-e2db-4a40-8152-1f6df78e273a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ కు ఇప్పుడు తెలంగాణలో ముస్లిం ఓట్ల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణలో ఓటు బ్యాంకు అంటే ఎక్కువగా ముస్లిం వర్గాలదే ఉంటుంది అని అంటారు. ‌ తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రధానమైన సమస్య ఈ ఓటు బ్యాంకు. అక్కడ మైనార్టీ వర్గం అంటే ముస్లిమ్స్ అందరూ ఎంఐఎం వైపే ఉంటారు. ‌ ఆ ఎంఐఎంను గతంలో పెంచి పోషించింది కాంగ్రెస్సేనని అంటారు. కానీ ఇప్పుడు ఆ ఎంఐఎం టిఆర్ఎస్ వైపు ఉంది. టిఆర్ఎస్ కు, ఎంఐఎం కు ఇంటర్నల్ అండర్‌ స్టాండింగ్‌ ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంఐఎంను బి బ్యాచ్ గా పరిగణిస్తూ వచ్చింది.CONGRESS{#}Laloo Prasad Yadav;MIM Party;Bihar;Congress;Bharatiya Janata Partyతెలంగాణలో కాంగ్రెస్‌కు ముస్లింలతో తలనొప్పి?తెలంగాణలో కాంగ్రెస్‌కు ముస్లింలతో తలనొప్పి?CONGRESS{#}Laloo Prasad Yadav;MIM Party;Bihar;Congress;Bharatiya Janata PartyWed, 16 Aug 2023 08:00:00 GMTకాంగ్రెస్ కు ఇప్పుడు తెలంగాణలో ముస్లిం ఓట్ల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే  ప్రత్యేకించి తెలంగాణలో ఓటు బ్యాంకు అంటే ఎక్కువగా ముస్లిం వర్గాలదే ఉంటుంది అని అంటారు. ‌ తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రధానమైన సమస్య ఈ ఓటు బ్యాంకు. అక్కడ మైనార్టీ వర్గం అంటే ముస్లిమ్స్ అందరూ  ఎంఐఎం  వైపే ఉంటారు. ‌ ఆ ఎంఐఎంను గతంలో పెంచి పోషించింది కాంగ్రెస్సేనని అంటారు.


కానీ ఇప్పుడు ఆ ఎంఐఎం టిఆర్ఎస్ వైపు ఉంది. టిఆర్ఎస్ కు, ఎంఐఎం కు ఇంటర్నల్  అండర్‌ స్టాండింగ్‌ ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంఐఎంను బి బ్యాచ్ గా పరిగణిస్తూ వచ్చింది. అయితే గతంలో తనను పెంచి పోషించిన కాంగ్రెస్ వైపు ఇప్పుడు ఎంఐఎం మొగ్గుచూపుతోందా అంటే చెప్పలేని పరిస్థితి. అలాగని కాంగ్రెస్ ఎంఐఎం తో పొత్తు పెట్టుకుంటే దేశ వ్యాప్తంగా తన పరువు పోయిన పరిస్థితి ఏర్పడుతుంది.


అలాగని  పెట్టుకోకపోతే ముస్లిం ఓటు బ్యాంకు  తనకు కాకుండా పోతుంది. మొన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లలో ముస్లిమ్స్ కాంగ్రెస్ కు తమ మద్దతును  తెలిపారని అంటారు. అయితే ఈ ఫలితాన్ని చూసి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో కూడా ముస్లిమ్స్ అందరూ తనకు మద్దతు పలుకుతారని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే  కర్ణాటకలో ముస్లిమ్స్ కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు అంటే తన వెనకాల ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది.


అదేంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ వర్సెస్ బిజెపి వాతావరణం ఉంటుందో అక్కడ ఈ మైనార్టీ వర్గం ముస్లిమ్స్ అందరూ కూడా బిజెపికి వ్యతిరేకమైన కాంగ్రెస్ కు తమ మద్దతును తెలిపారని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో ముస్లిమ్స్ సమాజ్వాది పార్టీకే సపోర్ట్ చేశారు. బీహార్ లో ముస్లిమ్స్ లాలూ ప్రసాద్ యాదవ్ కే సపోర్ట్ చేశారు. అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిములను తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>