Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhioa28d5cf5f-a3cc-47f4-b483-134e0a09a4ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhioa28d5cf5f-a3cc-47f4-b483-134e0a09a4ee-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి రిమేక్ సినిమాల వెంట పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. రీయంట్రి తర్వాత చిరు చేసిన ఎక్కువ సినిమాల్లో రిమేక్ సినిమాలే ఉండడం గమనార్హం. అయితే ఇలా వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిరుకి రీమేక్ సినిమాలు హిట్స్ మాత్రం అందించలేకపోతున్నాయ్. ఇటీవల బోలా శంకర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్. ఈ సినిమా కూడా చిరంజీవి అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. మొదటి రోజు నుంచి మిక్స్డBhioa{#}Chiranjeevi;Murli Sharma;ajith kumar;keerthi suresh;lakshmi menon;Telugu;Audience;Remake;Lakshmi Devi;Makeup;Ajit Pawar;shankar;Cinemaఆ రెండు తప్పులే.. బోళాను దెబ్బ కొట్టి డిజాస్టర్ చేశాయా?ఆ రెండు తప్పులే.. బోళాను దెబ్బ కొట్టి డిజాస్టర్ చేశాయా?Bhioa{#}Chiranjeevi;Murli Sharma;ajith kumar;keerthi suresh;lakshmi menon;Telugu;Audience;Remake;Lakshmi Devi;Makeup;Ajit Pawar;shankar;CinemaWed, 16 Aug 2023 07:40:00 GMTగత కొంతకాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి రిమేక్ సినిమాల వెంట పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. రీయంట్రి తర్వాత చిరు చేసిన ఎక్కువ సినిమాల్లో రిమేక్ సినిమాలే ఉండడం గమనార్హం. అయితే ఇలా వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిరుకి రీమేక్ సినిమాలు హిట్స్ మాత్రం అందించలేకపోతున్నాయ్. ఇటీవల బోలా శంకర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్. ఈ సినిమా కూడా చిరంజీవి అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది అని చెప్పాలి.


 మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక ఒక వారం తిరిగేలోపే కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అవడంతో ఫ్లాప్ అని తేలిపోయింది. ఇక ఎంత నష్టం మిగులుతుంది అనే లెక్కలు కూడా బయ్యర్లను మరింత భయపెడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక కొంతమంది సినీ విశేషకులు అసలు బోలాశంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అన్న విషయంపై చర్చించుకుంటున్నారు. అయితే ఒక రకంగా చిరంజీవి ఎంచుకున్న స్క్రిప్ట్ అండ్ స్టోరీ మంచిదే అయినా రెండు తప్పులు మాత్రం సినిమాపై ప్రభావం చూపించాయి అని భావిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్ ఇప్పుడు తెలుగు రీమేక్ వెర్షన్ చూసిన ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదేనట.


 వేదాళం ఒరిజినల్ వర్షన్ లో అజిత్ కు చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. పూర్తిగా డి గ్లామర్ లుక్ లో ఈ పాత్ర ఉంటుంది. అంతకుముందు ఆమె చేసిన పాత్రలు కూడా ఇలాంటివే. కానీ ఇక్కడ తెలుగుకు వచ్చేసరికి గ్లామర్ రోల్స్ చేస్తున్న కీర్తి సురేష్ ని తీసుకోవడంతో మనసులో ఆ పాత్ర పై ప్రేక్షకులకు సానుభూతి ఏర్పడలేదు. ఇక మేకప్ కాస్ట్యూమ్స్ రిచ్ గా ఉన్నాయి. ఇది కూడాప్రేక్షకులకు నచ్చలేదు. వేదాళంలో లక్ష్మీ తల్లిదండ్రులకు చూపు ఉండదు. సింపతి ఎమోషన్ పరంగా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ మన దగ్గర మురళీ శర్మ జంటకు రిచ్ క్యాస్టింగ్ పెట్టుకున్నారు. కట్టు బొట్టు అన్ని ఎగువ మధ్యతరగతి అనిపించేలాగే ఉన్నాయి. దీంతో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ రెండే భోళాశంకర్కు మైనస్ గా మారాయి. నలుగురు అనుభవం ఉన్న రచయితలు ఈ అంశాల మీద మరింత కాస్త సీరియస్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>