PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-to-protest-at-indira-park-for-distribution-of-bhk-housesc38a6db3-4bb9-4178-8173-81c709fc6b07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-to-protest-at-indira-park-for-distribution-of-bhk-housesc38a6db3-4bb9-4178-8173-81c709fc6b07-415x250-IndiaHerald.jpgనిజానికి షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ఉండగా పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడిని నియమించుకోలేకపోవటంలోనే బీజేపీ అగ్రనేతల ఫెయిల్యూర్ కనబడుతోంది. పూర్తి స్ధాయి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా పార్టీ కార్యక్రమాలకు, నేతలతో సమావేశాలకు 24 గంటల సమయం సరిపోదు. అలాంటిది కేంద్రమంత్రిగా ఉంటూనే పార్టీ అధ్యక్షుడిగా కూడా యాక్ట్ చేయటం అంటే అది సాధ్యమయ్యే పనికాదు. మొన్ననే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కిషన్ ఢిల్లీలో ఉండిపోయారు. kishanreddy modi telangana{#}G Kishan Reddy;Amith Shah;రాజీనామా;Amit Shah;Parliament;central government;police;Bharatiya Janata Party;Party;Elections;Yevaruహైదరాబాద్ : డబుల్ యాక్షన్ తో ఇబ్బంది పడుతున్నారా ?హైదరాబాద్ : డబుల్ యాక్షన్ తో ఇబ్బంది పడుతున్నారా ?kishanreddy modi telangana{#}G Kishan Reddy;Amith Shah;రాజీనామా;Amit Shah;Parliament;central government;police;Bharatiya Janata Party;Party;Elections;YevaruWed, 16 Aug 2023 09:00:00 GMT


గంగాపురం కిషన్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఈ విషయం అర్ధమైపోతోంది. కేంద్రమంత్రిగా ఉండగానే కిషన్ రెడ్డిని అధిష్టానం తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. అద్యక్షుడయ్యారు కాబట్టి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసేస్తారని అందరు అనుకున్నారు. అయితే అలా జరగలేదు. పైగా రెండు పదవుల్లోను కిషన్ కంటిన్యు అవుతున్నారు. అంటే ఒకవైపు కేంద్రమంత్రిగాను మరోవైపు పార్టీ అధ్యక్షుడిగాను వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో కిషన్ రెండుపదవులను బ్యాలెన్స్ చేసుకోలేక నానా అవస్తలు పడుతున్నారు.





నిజానికి షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ఉండగా పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడిని నియమించుకోలేకపోవటంలోనే బీజేపీ అగ్రనేతల ఫెయిల్యూర్ కనబడుతోంది. పూర్తి స్ధాయి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా పార్టీ కార్యక్రమాలకు, నేతలతో సమావేశాలకు 24 గంటల సమయం సరిపోదు. అలాంటిది కేంద్రమంత్రిగా ఉంటూనే పార్టీ అధ్యక్షుడిగా కూడా యాక్ట్ చేయటం అంటే అది సాధ్యమయ్యే పనికాదు. మొన్ననే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కిషన్ ఢిల్లీలో  ఉండిపోయారు.





మరి ఢిల్లీలో కిషన్ ఉన్నపుడు తెలంగాణాలో పార్టీ కార్యక్రమాలను ఎవరు చూడాలి ? ఎవరు చూడలేదు. అధ్యక్ష పదవితో పాటు కేంద్రమంత్రిగా కంటిన్యు అవటం వల్ల కిషన్ కు వచ్చిన అదనపు లాభం ఏమిటో తెలీటంలేదు. ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. జోడు పదవుల్లో చివరకు కిషన్ ఫెయిలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అటు కేంద్రమంత్రి పదవికి న్యాయం చేయలేక, ఇటు అధ్యక్షుడిగా నేతలకు పూర్తిగా అందుబాటులో ఉండలేకపోతున్నారు.





ఒకపుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా కొంతకాలం పనిచేశారు. అప్పట్లో అమిత్ కూడా జోడు పదవులను సక్రమంగా నిర్వర్తించలేక నానా అవస్తలు పడ్డారు. సేమ్ టు సేమ్ అదే పద్దతిలో ఇపుడు కిషన్ రెడ్డి కూడా  వెళుతున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కిషన్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చని అనుకునేదుకు కూడా లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పరిశీలించాలని అనుకుని రోడ్డుమీదే పెద్ద సీన్ చేసినపుడు పోలీసులు కిషన్ అరెస్టు చేశారు. చూస్తుంటే రెండు పదవులకు న్యాయంచేయలేక కిషన్ బాగా ఇబ్బంది పడుతున్నట్లున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' లో హోమ్లీగా కనిపించిన ఈమె.. బయట ఇంత హాట్ గా ఉందేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>