MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthcf1e6a1e-7148-4d2d-8240-467d76aeb656-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthcf1e6a1e-7148-4d2d-8240-467d76aeb656-415x250-IndiaHerald.jpgఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం విని చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా సినిమాలు చేస్తున్నారు.ఆ సినిమాలకు వసూళ్లు కూడా ఓ మాదిరిగా వస్తున్నాయి.అయితే తాజాగా రిలీజైన 'జైలర్' సినిమా మాత్రం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద అధిక వసూళ్లు రాబడుతూ రచ్చ రంభోలా చేస్తోంది.రజనీకాంత్ దెబ్బకు ఇప్పటి దాకా ఉన్న రికార్డులన్నీ కూడా గల్లంతవుతున్నాయి.ఆగస్టు 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా కRAJINIKANTH{#}Raccha;Dilip Kumar;Telugu;Tamil;Director;Rajani kanth;News;Cinemaకమల్ ని దాటిన రజిని.. జైలర్ హిట్టుతో ఆ నిర్ణయం?కమల్ ని దాటిన రజిని.. జైలర్ హిట్టుతో ఆ నిర్ణయం?RAJINIKANTH{#}Raccha;Dilip Kumar;Telugu;Tamil;Director;Rajani kanth;News;CinemaWed, 16 Aug 2023 17:45:00 GMTఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం విని చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా సినిమాలు చేస్తున్నారు.ఆ సినిమాలకు వసూళ్లు కూడా ఓ మాదిరిగా వస్తున్నాయి.అయితే తాజాగా రిలీజైన 'జైలర్' సినిమా మాత్రం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద అధిక వసూళ్లు రాబడుతూ రచ్చ రంభోలా చేస్తోంది.రజనీకాంత్ దెబ్బకు ఇప్పటి దాకా ఉన్న రికార్డులన్నీ కూడా గల్లంతవుతున్నాయి.ఆగస్టు 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా కానీ రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడం కూడా రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటి దాకా అనగా కేవలం ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.40 కోట్ల దాకా వచ్చాయని సమాచారం తెలుస్తుంది.


గత సంవత్సరం కమల్ హాసన్ 'విక్రమ్' మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తం రూ.410 కోట్లు వచ్చాయి.కానీ రజనీ 'జైలర్' సినిమా మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే ఈజీగా దాటేయడం విశేషం. ఇప్పటి దాకా తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో మున్ముందు చూడాలి.అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ స్టోరీ కొత్తదేం కాదు. అయినా కానీ రజనీ స్వాగ్, స్టైల్ తో పాటు ఇంకా అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అలాగే ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా చాలా అంశాలు 'జైలర్' సినిమాకు కలిసొచ్చాయి. అందువల్ల బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దుమ్ములేచిపోతోంది.ఇక జైలర్ 2 సినిమా కూడా అతి త్వరలో వస్తుందని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. మరి చూడాలి ఎప్పుడు జైలర్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కారులో టెంప్టింగ్ ఫోటోలతో హిట్ ఎక్కిస్తున్న సమంత..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>