Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virala3811c9c-6029-42ce-97eb-a8768ddf2a33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virala3811c9c-6029-42ce-97eb-a8768ddf2a33-415x250-IndiaHerald.jpgవెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే,టెస్ట్ ఫార్మట్ లలో సత్తా చాటిన టీమిండియా టి20 ఫార్మాట్లో మాత్రం పేలవ ప్రదర్శనతో సిరీస్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే అటు టీమిండియా ప్రదర్శన గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక గెలుపు ఓటమిలు పక్కన పెడితే.. వెస్టిండీస్, టీం ఇండియా మధ్య జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో కొంతమంది ప్లేయర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వViral{#}Ram Gopal Varma;surya sivakumar;West Indies;Dookudu;Yashasvi Jaiswal;media;India;Successఆ క్యాచ్ చూసి.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్ అయింది?ఆ క్యాచ్ చూసి.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్ అయింది?Viral{#}Ram Gopal Varma;surya sivakumar;West Indies;Dookudu;Yashasvi Jaiswal;media;India;SuccessTue, 15 Aug 2023 17:00:00 GMTవెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే,టెస్ట్ ఫార్మట్ లలో సత్తా చాటిన టీమిండియా టి20 ఫార్మాట్లో మాత్రం పేలవ ప్రదర్శనతో సిరీస్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే  అటు టీమిండియా ప్రదర్శన గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక గెలుపు ఓటమిలు పక్కన పెడితే.. వెస్టిండీస్, టీం ఇండియా మధ్య జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో  కొంతమంది ప్లేయర్లు తమ ఫీల్డింగ్  విన్యాసాలతో అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు  సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి.



మరీ ముఖ్యంగా ఐదవ టి20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వెస్టిండీస్ ప్లేయర్ రోస్టన్ చేజ్ సంచలన క్యాచ్ తో మెరిసాడు. అయితే దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్ పట్టి పెవీలియన్ పంపించడంలో  సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు ఆదిలోనే దెబ్బ పడింది. ఓపెనర్లు గిల్, యశస్వి జైష్వాల్   వరుసగా వికెట్ కోల్పోయారు. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోసెఫ్ బౌలింగ్ తిలక్ కర్మ 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.



 ఈ క్రమంలోనే తిలక్ దూకుడు కి అడ్డుకట్ట వేసేందుకు వెస్టిండీస్ కెప్టెన్ స్పిన్నర్స్ ఛేజ్ ను తీసుకువచ్చాడు. అయితే ఇక కెప్టెన్ రోవ్ మన్ పావల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన తొలి ఓవర్ లోనే సంచలన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మను పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు. ఏడవ ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్ లో తిలక్ వర్మ లాంగ్ ఆఫ్ దిశగా ఆడెందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే చేజ్ అద్భుతంగా డైవ్ చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు  అయితే అది బంప్ బాల్ అనే అందరూ అనుకున్నారు. కానీ ఫీల్ ఎంపైర్లు థర్డ్ అంపైర్ కు రిపర్ చేయగా రిప్లై లో బంతి బ్యాట్ కు తాకి నేరుగా చేతుల్లోకి వెళ్లినట్లు తేలింది. దీంతో 27 పరుగుల వద్ద తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని పెట్టాడు.  అయితే ఛేజ్ పట్టిన క్యాచ్ తో తిలక్ వర్మ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>