HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthadf56efc-7e21-4d79-a527-e4fc68e6cd4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthadf56efc-7e21-4d79-a527-e4fc68e6cd4c-415x250-IndiaHerald.jpgచాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ డైట్ ను పాటించడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా ఈజీగా అందుతాయి.షుగర్ వ్యాధితో బాధపడే వారు తెల్లగా ఉండే పదార్థాలు పంచదార, పాలిష్ పట్టిన బియ్యం, ధాన్యాలు, మైదాపిండి, రవ్వలు ఇంకా బ్రెడ్ వంటి వాటిని తీసుకోకూడదు.ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.అందుకే పాలిష్ పట్టని ధాన్యాలను వాటితో చేసే ఆహారాలను ఎక్కువగా తీసుకhealth{#}Rajma;Sugar;Manam;Chiranjeeviషుగర్ వ్యాధి గ్రస్తులు ఇవి తింటే సమస్య మాయం?షుగర్ వ్యాధి గ్రస్తులు ఇవి తింటే సమస్య మాయం?health{#}Rajma;Sugar;Manam;ChiranjeeviTue, 15 Aug 2023 15:27:00 GMTచాలా మంది  షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ డైట్ ను పాటించడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా ఈజీగా అందుతాయి.షుగర్ వ్యాధితో బాధపడే వారు తెల్లగా ఉండే పదార్థాలు  పంచదార, పాలిష్ పట్టిన బియ్యం, ధాన్యాలు, మైదాపిండి, రవ్వలు ఇంకా బ్రెడ్ వంటి వాటిని తీసుకోకూడదు.ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.అందుకే పాలిష్ పట్టని ధాన్యాలను వాటితో చేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో తెల్ల అన్నానికి బదులు చపాతీలను మనం ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే బ్రౌన్ రైస్, చిరు ధాన్యాలతో వండిన అన్నాన్ని ఇంకా క్వినోవాతో వండిన అన్నాన్ని తీసుకోవాలి. ఇంకా అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పులను తీసుకోవాలి. అలాగే మన శరీరానికి ప్రోటీన్ కూడా చాలా అవసరం.కందిపప్పు, పెసరపప్పు, రాజ్మా ఇంకా కాబూలీ చనా వంటి వాటితో పప్పు కూరలను వండుకుని తగిన మోతాదులో తీసుకోవాలి. ఇంకా అలాగే బంగాళాదుంపలను తీసుకోవడం, వాటితో తయారు చేసే పదార్థాలను తీసుకోవడం కూడా తగ్గించాలి.


తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే కూరగాయలతో కూరలను ఖచ్చితంగా వండుకుని తినాలి.ఇంకా అదే విధంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పాటు ఫైబర్ ఉండే వాటితో సలాడ్ ను తయారు చేసి తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఉండే కూరగాయలతో చేసే సలాడ్ ను తీసుకోవడం వల్ల అవి జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు దాదాపు అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు.పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈజీగా పొందవచ్చు.ఇంకా అలాగే మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. ఇవి శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఈజీగా అదుపులో ఉంచుతాయి.ఇంకా అలాగే వీటిని సాధ్యమైనంత వరకు పచ్చిగానే తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ విధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>